స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన సింధుని, నిన్న రాష్ట్ర ప్రభుత్వం సాన్మానించింది. ఇది జరిగి దాదపుగా రెండు వారల పైన అవుతుంది. సింధు ఇండియా వచ్చిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యామంత్రి కేసిఆర్ తో పాటు, మిగతా ప్రముఖులు కూడా సింధుని సన్మానించారు. అయితే సింధుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంత వరకు సన్మానించక పోవటంతో, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే నిన్న ఎట్టకేలకు, సింధుని సన్మానించింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ మోహన్ రెడ్డికి ఇన్నాళ్టకు ఫ్రీ అవ్వటంతో, సింధుకి అప్పాయింట్మెంట్ ఇచ్చారు. సింధుని సన్మానించి, విశాఖలో అకాడమీ కోసం ఐదు ఎకరాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తునందని చెప్పారు.

sindhu 14092019 2

అయితే సింధుతో పాటు, సింధుని తీర్చి దిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే, సింధుని ఎప్పుడు, ఎవరు సన్మానం చేసినా, కోచ్ గా ముందు గోపీచంద్ ను అభినందిస్తూ ఉంటారు. మొన్న సింధు, ప్రధాని మోడీని కలిసిన సమయంలో కాని, అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సందర్భంలో కాని, గోపీచంద్ కూడా సింధు పక్కనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో, గోపీచంద్ లేకపోవటంతో, రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. ఆయన అందుబాటులో లేకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి కుదరలేదని చెప్పారు. అయితే దీనికి వేరే కారణం ఉండనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

sindhu 14092019 3

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం స్థలం ఇచ్చారు. అయితే తరువాత సియం అయిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నం చెయ్యటంతో, అది పెద్ద వివాదాస్పదం అయ్యింది. ఒకటి రెండు ఇంటర్వ్యూ ల్లో, గోపీచంద్ కూడా ఇదే విషయం చెప్పారు. కోర్ట్ ల్లో పోరాడి ఆ స్థలం సాధించామని, సింధు కూడా ఈ అకాడమీలోనే శిక్షణ పొందిందని చెప్పారు. అయితే ఇది మనసులో పెట్టుకుని, జగన్ వద్దకు గోపీచంద్ రాలేదా ? లేకపోతే ప్రభుత్వం తరుపున ఆయనకు పిలుపు అందలేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సింధుని ఇన్నాళ్ళు ఎందుకు సన్మానం చెయ్యలేదు ? దేశం గర్వించే ఇలాంటి ఆడ పిల్లలను ప్రోత్సహించాలి కదా అనే విమర్శలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిన్న సింధుని సన్మానించినా, గోపి చంద్ లేకపోవటంతో, ఇది మరో చర్చకు దారి తీసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read