ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తిత్లి తుపాను అతలాకుత లం చేసిన నేపధ్యంలో ఆ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యల పట్ల ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసిం హన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాల్లో చంద్రబాబునాయుడు ముందు చూపును ప్రదర్శించి సహాయ, పునరావాస కార్యక్రమాల నిర్వహణలో అధికార యంత్రాంగంతో చురుకుగా పనిచేయించారని అభినందించారు. ఈ మేరకు గవర్నర్‌ నరసింహన్‌ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అభినందన లేఖ రాశారు. ఈ తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడం పట్ల గవర్నర్‌ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

governer 16102018 2

శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ24 గంటలు విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం శ్రీకాకుళం జిల్లాలో ఇదే ప్రథమం. గతంలో విశాఖకు హూద్ హూద్ వచ్చినప్పుడు కూడా, ఇలాగే పని చేసారు చంద్రబాబు.

governer 16102018 3

తాజగా శ్రీకాకుళంలో కూడా అలాగే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో డిప్యూటీ సి.ఎం. నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పితాని సత్యనారాయణ, నారా లోకేష్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు విజయానంద్, అజయ్‌జైన్, నీరపుకుమార్‌ప్రసాద్, పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరితోపాటు 50 మంది ఐఎఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు, 136 మంది ఉన్నతాధికారులతో పలాసలో మినీ సెక్రటేరియేట్‌ను ముఖ్యమంత్రి నడుపుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read