ఆడంబరాలకు దూరంగా ఉండే రాష్ట్ర ప్రథమ పౌరుడు మరో ఆరు దైన నిర్ణయం తీసుకున్నారు. ప్రొటోకాల్ పేరిట సాగే ఎర్ర తివాచీ స్వాగతాలు ఇక వద్దంటున్నారు. రాష్ట్ర రాజ్యాంగ పరిరక్షకుడి హోదాలో గవర్నర్‌కు అత్యున్నత స్థాయి గౌరవ మర్యాదలు ఎటూ అందుబాటులో ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇకపై అలాంటి మర్యాదలు ఏవీ వద్దంటున్నారు. వాయు శకటం నుండి ఎర్రతివాచీతో గవర్నర్‌ను స్వాగతించే విధానం రద్దుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని తన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశిం చారు. ఇటీవల శ్రీశైలం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ తరహా ఆలోచనకు అంకురార్పణ చేసిన గవర్నర్ దానిని ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయిం చారు. అనవసరపు వ్యయంతో కూడిన బ్రిటీష్ కాలం నాటే సాంప్రదాయాలను విడనాడాలని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన కార్యక్రమాలను మాత్రం ప్రొటోకాల్ ప్రకారం నిర్వహిస్తే సరిపో తుందని, గవర్నర్ ప్రతి పర్యటనకు ఎర్రతివాచీలు అవసరం లేదని ఆయన భావిస్తున్నారు.
గవర్న గా ప్రమాణ స్వీకారం తొలిరోజునే "హిస్ ఎక్స లెన్సీ" పేరిట సంబోధన వద్దని ప్రజలకు సైతం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా నేతలు పొదుపుపై ప్రసంగాలు చేస్తారే తప్ప ఆచర ణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. కాని గవర్నర్ హరిచందన్ తనదైన శైలిలో వ్యవ హరిస్తూ తనకు తానుగా స్వీయ నియంత్రణ పాటి స్తున్నారు. తన పర్యటనలు హంగు, అర్భాటాలకు దూరంగా సాగాలని తన సిబ్బందికి స్పష్టం చేసిన ప్రథమ పౌరుడు సగటు ప్రజల కోసం ఏమి చెయ్య గలమన్న దానిపైనే ఎక్కువగా దృష్టిసారిస్తూ ఉంటారు. రాజ్ భవన్ గౌరవ మర్యాదలు కాపాడే క్రమంలో కొంతమేర ప్రొటోకాల్ తప్పదంటూ అధికారులు అనుక్షణం ఆయనకు నచ్చచెప్పుకో వాల్సి వస్తుందంటే హరిచందన్ పనితీరు ఇట్టే అర్ధం అవుతోంది. ప్రతి చిన్న విషయంలోనూ పొదుపు చర్యలను అభిలపించే హరిచందన్ తన గౌరవార్ధం వివిధ సందర్భాల్లో ప్రముఖులు అందించే శాలువాలను సైతం ఎలా సద్వినియోగం చేయగలమన్న దానిపై ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే తనను కలిసేందుకు వచ్చే వారి నుండి పుష్ప గుచ్ఛం స్వీకరించే విధానాలకు స్వస్తి పలికిన గవ ర్నర్, తనకోసం వచ్చే ఎవరైనా మొక్కలను మాత్రమే తీసుకురావాలని నిర్దేశించారు. ఇలా వస్తున్న మొక్కలను తిరిగి రాజ భవన్ ప్రాంగణంలో నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. ప్రథమ పౌరునిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి సగటు ప్రజ లతో మమేకం అయ్యేందుకే ఇష్టపడే హరిచందన్ తదనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. గిరిజన ప్రాంతాలపై పరిపాలకుడి హోదాలో ప్రత్యేక అధి కారాలు కలిగిన గవర్నర్ వాటిని సద్వినియోగ పరచటం ద్వారా వారికేదైనా మేలు చేయగలమా అన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గతంలో విజయనగరం జిల్లా సాలూరు ఆదివాసీలతో భేటీ అయినా, ఇటీవల శ్రీశైలం చెంచులతో సంభాషించినా వారి కోసం ఏదో చేయాలన్న తలంపే కారణం.