ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. గతంలో ఉన్న గవర్నర్ నరసింహన్, ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసింది అంటే, వెంటనే రిపోర్ట్ తెప్పించుకుని కేంద్రానికి పంపించే వారు. ఇప్పటి గవర్నర్ లోపల పని తీరు ఎలా ఉందో, కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపిస్తున్నారో తెలియదు కానీ, బయటకు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వం కార్యక్రమాలు పెడితే వాటిలో, చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం, ఇలాంటివి తప్పితే, గవర్నర్ పెద్దగా ఆక్టివ్ గా ఉన్న సందర్భాలు లేవు. ముఖ్యంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు అనేక ఫిర్యాదులు ప్రతిపక్షం నుంచి వెళ్ళినా, ఆయన బయటకు అయితే ఎలాంటి నివేదిక కోరినట్టు వార్తలు రాలేదు. చివరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి పైన దా-డి కానీ, లేకపొతే ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన దా-డి కానీ, ఇలా ఏ విషయంలోనూ గవర్నర్ స్పందించినట్టు లేదు. ప్రభుత్వం ఎలాంటి వివాదాస్పద బిల్లు పంపించినా, గవర్నర్ ఆమోదించి పంపిస్తూ ఉంటారు. కోర్టులో ఉన్న మూడు రాజధానుల అంశం పైన కూడా, గవర్నర్ ఆమోదం చేసి పంపించారు. ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య మంచి సంబంధాలే ఉండేవి.
అయితే మొదటి సారి గవర్నర్, ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు అంటూ వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని వివరణ అడిగారు అంటూ వార్తలు వచ్చాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో తెలియదు కానీ, గవర్నర్ సీరియస్ అవ్వటం, రెండు రోజుల ముందే జగన్ మోహన్ రెడ్డి వెళ్లి కలవటం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఇది పాత అంశమే, అయినా ఇప్పటికిప్పుడు గవర్నర్ హడావిడిగా ఎందుకు స్పందించారు అనేది చూడాలి. నాలుగు నెలల క్రిందట టిడిపి అప్పుల విషయంలో సంచలన ఆరోపణలు చేసింది. గవర్నర్ పేరుని ఒప్పందంలో చేర్చి, గవర్నర్ అప్పు చేసినట్టు చూపించారని చెప్పింది. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసింది. దీని పై అప్పట్లో గవర్నర్ ఆక్షన్ లోకి దిగినట్టు ఏమి వార్తలు రాలేదు. అయితే రెండు రోజుల నుంచి గవర్నర్ ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారని, ప్రభుత్వాన్ని వివరణ అడిగారని వార్తలు వచ్చాయి. దీని వెనుక కేంద్రం సీరియస్ అవ్వటంతో, గవర్నర్ స్పందించారా ? లేక కోర్టులు సీరియస్ అవ్వటంతో గవర్నర్ స్పందించారా అనేది చూడాల్సి ఉంది.