రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన, అంశం అయిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతూ వెళ్తుంది. క-రో-నా విలయతాండవం ముందే గుర్తించి, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వెయ్యటం, అలాగే తరువాత కేంద్రం పంపించిన క-రో-నా సాయాన్ని, స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉన్నవాళ్ళు పంచి పెడుతూ ఉండటంతో, వాళ్ళకు నోటీసులు ఇవ్వటంతో, ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకోవచ్చి, నిమ్మగడ్డ పదవి పోయెలే చూడటం, తరువాత హైకోర్టుకు వెళ్ళటం, తరువాత సుప్రీం కోర్టుకు వెళ్ళటం, మళ్ళీ హైకోర్టులో ధిక్కారణ పిటీషన్ వెయ్యటం, ఇలా అనేకం జరిగిన తరువాత, ఈ అంశం గవర్నర్ వద్దకు చేరిన విషయం తెలిసిందే. పోయిన వారం హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, నిమ్మగడ్డను, గవర్నర్ వద్దకు వెళ్లి, హైకోర్టు ఆదేశాలు చెప్పాలని, కోరింది. దీని ప్రకారం, రెండు రోజులు క్రితం, నిమ్మగడ్డ, వెళ్ళు గవర్నర్ ను కలిసారు. కోర్టు ఆదేశాలు గవర్నర్ కు వివరించారు. గవర్నర్ తో భేటీ తరువాత, తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
అయితే ఈ లోపే ప్రభుత్వం, మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది. అయితే దీని పై గవర్నర్ ఏమి చేస్తారా అని అందరూ అనుకున్న సమయంలో, గవర్నర్ ఈ రోజు తన నిర్ణయం ప్రకటించారు. దీనికి సంబంధించి, ఆయన నిమ్మగడ్డకు లేఖ రాసారు. ఆ లేఖలో, మీరు ఇచ్చిన విజ్ఞప్తిని, రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేసాము, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఫాలో అవ్వమని ప్రభుత్వాన్ని కోరినట్టు, గవర్నర్ ఆ లేఖలో తెలిపారు. దీంతో నిమ్మగడ్డ నియామకం చెయ్యాల్సిన పరిస్థితి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పని సరి పరిస్థితి. అయితే ఇక్కడ మరో అంశం ఆసక్తిగా మారింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, గవర్నర్ కు రీస్టోర్ చేసే అధికారం ఉంటుందని, అందుకే ఆయన్ను కలవమని చెప్పగా, గవర్నర్ మాత్రం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తగు చర్యలు తీసుకోమని చెప్తున్నాము అని చెప్పటంతో, మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఏమి చేస్తుందో చూడాలి. కోర్టు చెప్తేనే, రాష్ట్ర ప్రభుత్వం చెయ్యటం లేదు, మరి గవర్నర్ చెప్తే చేస్తుందా, అనేది చూడాలి.