తెలంగాణాలో ప్రజా కూటమి నేతలు, రాజ్‌భవన్‌లో గవర్నర్ ని కలిసిన సందర్భంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తెలంగాణా టీడీపీ సీనియర్ నేత పై గవర్నర్ నరసింహన్ సెటైర్ వేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వంద సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా ఉంది. ఇటు కాంగ్రెస్‌ కూడా 80 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధిస్తామని చెబుతున్నారు. ఎవరికి వారు ధీమాగా ఉన్నా.. వీరిని హంగ్ భయం వెంటాడుతోంది. అందువల్ల ఇరు పార్టీల నేతలు ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కూటమి నేతలు మరో ముందగుడు వేశారు. మహాకూటమి విజయం తథ్యమని భావించిన నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. సోమవారం గవర్నర్‌తో భేటీ అయ్యారు.

governer 11122018

ఈ సమావేశంలో గవర్నర్, కూటమి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అదేంటంటే... మొదట ప్రజాకూటమి ఏర్పాటు, ఎజెండా తీర్మానాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వ ఏర్పాటు ఇతర అంశాలు మాట్లాడుతున్నప్పుడు టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి గవర్నర్ ముందు కూర్చొని మాట్లాడడాన్ని గవర్నర్ ప్రశ్నించారు. ‘‘అదేంటి ఎప్పుడూ నిలబడి మాట్లాడుతావ్ కదా... ఈ రోజు కూర్చొని మాట్లాడుతున్నారు’’ అని గవర్నర్ సెటైర్ వేశారని వినికిడి. దీంతో ఆయన వెంటనే లేచి నిలబడ్డారు. రావుల నిల్చోగానే గవర్నర్ వెంటనే కల్పించుకున్నారు. ‘‘సరదాగా అన్నాను.. కూర్చోండి’’ అని చెప్పారు. పర్వాలేదు నిల్చొనే మాట్లాడతా అని రావుల సమాధానం ఇచ్చినట్లు రాజ్‌భవన్ వర్గాల సమాచారం.

 

governer 11122018

ఇదిలావుంటే కర్నాటక ప్రభుత్వ ఏర్పాటులో జరిగిన రాజకీయ పరిణామాలను గవర్నర్ ముందు సుప్రీంకోర్టు న్యాయవాది జంధ్యాల ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కర్ణాటక సంగతి ఏంటని న్యాయవాది, ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌కు ముందే పొత్తు కుదుర్చుకున్న ప్రజాకూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్లయితే వారినే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అతిపెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఫలితాలకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అదే జరిగితే గవర్నర్ ఏ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంపై గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్న కూటమికే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read