రాజధాని వికేంద్రీకరణ, సీఆర్టీఏ బిల్లులు ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిశీలనలో ఉన్నాయి. ఈ బిల్లులకు రాజముద్ర లభిస్తుందా లేదా అనేది ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర పడటం ఖాయం అని అధికార పార్టీ భావిస్తోంది. రాజధాని వికేంద్రీకరణ అనేది కేంద్రం పరిధిలోని అంశంగా విపక్షాలు వాదిస్తున్నాయి. ఈ క్రమంలో రాజధాని బిల్లులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ న్యాయ సలహా తీసుకోనున్నారు. గురువారం, శుక్రవారం రెండు రోజులు సీనియర్ న్యాయవాదుల అభిప్రాయాలను రాజ్ భవన్ అధికారులు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి బిల్లు వచ్చిన వెంటనే రాజ్ భవన్ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించారు. విభజన చట్టంతో బిల్లులు ముడివడి ఉన్నాయని, రాష్ట్రపతికి పంపాలని విపక్షాలు విజ్ఞప్తి చేయడాన్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకుని న్యాయపరంగా చిక్కులేకుండా సలహ ఇవ్వాలని గవర్నర్ కోరినట్లు సమాచారం. సీనియర్ న్యాయవాదులు, రాజ్యాంగ నివుణులతో చర్చించిన తర్వాత రెండు రోజుల్లో బిల్లులపై గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోనున్నారు. గత నెలలో రాష్ట్ర శాసనసభ రెండవ వర్యాయం రాజధాని వికేంద్రీకరణ, సీఆర్టీఏ బిల్లులను ఆమోదించింది.
అయితే అధికార, విపక్షాల నడమ ఈ బిల్లులు శాసనసభలో చర్చ రాకుండానే ఆగిపోయాయి, శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపినందున వీటిపై చర్చ జరగడానికి వీలులేదని గత నెలలో జరిగిన సమావేశాల్లో శాసనమండలిలో మెజార్టీ ఉన్న వివక్షం వాదించింది. అయితే నిబంధనలను అనుసరించి శాసనసభ ఆమోదించిన బిల్లులను మండలి నెలరోజుల లోపుగా ఆమోదించకుంటే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లు భావిస్తారు. దాంతో శాసనసభ స్పీకరు ఈ బిల్లులను ఈ నెల 17కు నెలరోజుల వ్యవధి ముగియడంతో ఈనెల 18న గవర్నర్‌కు ఆమోదం నిమిత్తం పంపించారు. ఆయన వీటిపై వెంటనే న్యాయసలహాలకు ఈ బిల్లులను వంపినట్లు సమాచారం, ఎపి రాజధాని బిల్లులు అటు తిరిగి, ఇటు తిరిగి మరలా రాజాభవన్ ను చేరాయంటున్నారు. అయితే మరో వైవు ఈ బిల్లులపై పిఏంవో ఆరా తీయడం జరిగిందంటున్నారు. ఈ సందర్భంలో రాజధానిపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యలను కీలకంగా పరిగణించాలని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టు పిటిషనులు విచారణలో ఉన్నందున గవర్నర్ బిల్లులను ఆమోదించరనే వాదనలో కూడా ఉంది.