ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూల్ గా ఉంటారు. సహజంగా గవర్నర్లు అందరూ తమ పరిధిలో తాము పని చేసుకుంటూ, రోజు వారీ రాజకీయ విషయాల్లో తల దూర్చరు. అయితే మనకు గత పది ఏళ్ళలో అప్పటి గవర్నర్ నరసింహన్ చాలా ఆక్టివ్ గా ఉండే వారు కాబట్టి, ప్రస్తుత గవర్నర్ కూడా అలా దూకుడుగా ఉంటారని భావించినా, ఇప్పటి గవర్నర్ శైలి అందుకు భిన్నం. అందరి గవర్నర్ లు లాగే, విషయాలు కేంద్రానికి రిపోర్ట్ చేయటమే కానీ, నేరుగా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. చంద్రబాబు ఇంటి మీద కాని, ప్రతిపక్ష టిడిపి కార్యాలయం మీదకు వెళ్ళినా కూడా గవర్నర్ తన పరిధిలోనే వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఇంత కూల్ గా ఉండే గవర్నర్ కూడా ఆగ్రహం తెప్పించింది ప్రస్తుత ప్రభుత్వం. ఆయన అనుమతి లేకుండా, ఆయన పేరు వాడుకోవటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయటంతో, గవర్నర్ కూడా సీరియస్ అయ్యారు. మన రాష్ట్ర ప్రభుత్వం, అప్పులు చేస్తున్న తీరు ఒక రికార్డ్. ఆ అప్పులు కూడా వింత వింతగా తెస్తున్నారు. ఆర్బిఐ లిమిట్ దాటిపోయినా, లెక్కలు దాచి, అప్పులు తెస్తున్నారని టిడిపి ఆరోపిస్తుంది. ఇక వచ్చే 25 ఏళ్ళ మద్యం ఆదాయం చూపించి, అప్పు తేవటం మరో హైలైట్. అలాగే ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు.

governor 31102021 2

అప్పులు కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పేరిట ఒక కొత్త కార్పోరేషన్ ఏర్పాటు అయ్యింది. దాన్ని ఉపయోగించి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో, గవర్నర్‌ ష్యూరిటీ ఇచ్చినట్టు ఒప్పంద పాత్రల్లో రాసారు. దీని పై ఇప్పటికే పెద్ద రాద్దాంతం అయ్యింది. టిడిపి ఈ విషయం బయట పెట్టటంతో, ఈ విషయం కోర్టుల వరకు వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలిపింది. ఏకంగా గవర్నర్‌ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టటం పై దేశమే నివ్వెర పోయింది. ఇప్పుడు ఇదే విషయం పై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా సీరియస్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారం పై వివరణ ఇవ్వాలి అంటూ, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్‌ శర్మకు లేఖ రాసారు అంటూ ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. ఎందుకు ఇలా చేసారో వివరణ ఇవ్వాలి అంటూ, గవర్నర్ కోరినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ తప్పు తెలుసుకున్న ప్రభుత్వం, ఒప్పందం నుంచి గవర్నర్ పేరు తొలగించే ప్రక్రియ చేపట్టినట్టు తెలుస్తుంది. మరి ప్రభుత్వం, గవర్నర్ కు ఏమి సమాధానం ఇస్తుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read