కో-వి-డ్ పరిస్థితి నానాటికీ తీవ్ర ఆందోళనకరంగా మారుతోందని, దేశ వ్యాప్తంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువ వుతోందని, ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా అలసత్వం వీడి జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు, ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం కో-వి-డ్ సంబంధించిన విషయాలను తెలి యచేస్తూ, ప్రజలకు తగిన సూచనలు ఇస్తూ, లోపాలను ఎలా సరి దిద్దుకోవాలో ప్రభుత్వానికి కూడా తెలియచేస్తున్నా రు. గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫ్ ర్మేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఆరోగ్యరంగ నిపుణులతో తగిన సలహాలు సూచనలు అందచేస్తున్నారు. ఆ క్రమంలోనే క-రో-నా వైరస్ లోనే ఒకరకమైన స్ట్రెయిన్ అయిన ఎన్ 440కే అనేది అత్యంత ప్రమాదకరమైనదని, దాని ఉనికిని మనరాష్ట్రంలోని కర్నూల్లో గుర్తించారని చెప్పడం జరిగింది. అదేదో పెద్ద నేరమైనట్లు మాజీ ముఖ్యమంత్రిపై ఈప్రభుత్వం కేసుపెట్టింది. మే 5వతేదీన చంద్రబా బునాయుడు దాని గురించిప్రస్తావిస్తే, మే 3న హిందూ దిన పత్రిక ఒకవార్తను ప్రచురించింది. ఎన్ 440కే అనేది వైరస్ లో ఒకరకమైన స్ట్రెయిన్ అని, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)కి చెందిన దివ్యతేజ్ సౌపతి అనే సైంటిస్ట్ అభిప్రాయాలను కూడా హిందూ దిన పత్రిక తమ కథనంలో పేర్కొనడం జరిగింది. టైమ్స్ఆఫ్ ఇండి యా కూడా మే2వ తేదీన ప్రచురించిన కథనంలో ఎన్ 440కే ఏపీలోని కర్నూల్లో కనుగొన్నట్లు పేర్కొన్నారు. ఆయా దిన పత్రికలతోపాటు, జాతీయస్థాయిలో ఉన్నదాదాపు 15 న్యూస్ ఛానళ్లు ఎన్ 440కే పై కథనాలు ప్రసారం చేశాయి.

sc 09052021 2

ఎన్డీటీవీ, న్యూస్ 18, టైమ్స్ నౌ, జీ-హిందూస్థాన్, న్యూస్ ఎక్స్, ఐబీసీ, ఇండియాహెడ్ వంటి అనేకప్రముఖ జాతీయ, అంతర్జాతీయ న్యూస్ ఛానళ్లు ఎన్ 440కే వేరియంట్ వైరస్ గురించి చెబితే, దానిపై మాట్లాడటం తప్పెలా అవుతుంది?
ఈ ముఖ్యమంత్రి ఏమీ పట్టించుకోడు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎవరు ఏం చెబుతున్నారు.. ఏం చర్యలు తీసుకోవాలని ఆలోచించడు. ఆయన ఆలోచనలన్నీ సంగం డెయిరీని ఎలా మూసేయాలి... జువారీ సిమెంట్ ను ఎలా క్లోజ్ చేయాలి... అమర్ రాజా కంపెనీలకు ఎలా తాళాలేయాలనే వాటి చుట్టూనే ఉంటాయి. లేకపోతే ఇసుకంతా జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కు ఎలా దోచిపెట్టాలి... పాడిపరిశ్రమను అమూల్ కు ఎలా ధారాధత్తంచేయాలనే ఆలోచిస్తుంటాడు తప్ప, ప్రజల ప్రాణాలగురించి పట్టించుకోడుకదా? పారా సిట్మాల్ , బ్లీచింగ్ పౌడర్ తోకరోనా తగ్గిపోతుందని చెప్పి గతంలోనే రాష్ట్రం కొంపముంచాడు. కాబట్టే, ఈముఖ్య మంత్రి పనితీరుచూసి, తన వంతు బాధ్యతగా చంద్రబాబు స్పందిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే అది తప్పా? దానికికర్నూల్లో అనామకుడైన ఒకవ్యక్తితో తప్పుడు కేసుపెట్టిస్తారా? ప్రతిపక్షపార్టీగా తాము సూచనలిస్తే దాన్నికూడా ఓర్చుకోలేరా? మీరు చేయాల్సింది చేయరు.. ప్రతిపక్షం ఏదైనా చెబితేనేమో తప్పుడుకేసులు పెడతారా?

ఏప్రియల్30వ తేదీన సుప్రీంకోర్టు చాలాస్పష్టంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేసింది. రిట్ పిటిషన్ నెం – 3/ 2021కి సంబంధించి చాలాస్పష్టంగా సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కో-వి-డ్ కు సంబంధించి ఎవరు ఎలాంటిసలహాలు ఇచ్చినా, సూచనలుచేసినా, ఎవరుప్రజలను అప్రమత్తంచేసే ప్రయత్నం చేసినా, అటువంటివారిపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయవద్దని చాలాస్పష్టంగా చెప్పింది. మీరు అటువంటి చర్యలకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద చర్యలుంటాయని కూడా హెచ్చరించింది. అన్నిరాష్ట్రాల డీజీపీలు, సీఎస్ లు, ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సుప్రీం కోర్టు తీర్పునుకూడా లెక్కచేయకుండా మాజీ ముఖ్యమంత్రి పై తప్పుడుకేసు పెడతారా. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని కూడా పట్టించుకోకుండా, ఎక్కడో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఏదో ట్వీట్ పెడితే, దానిపై ఈ ముఖ్యమంత్రి స్పందిస్తాడు. సుప్రీంకోర్టు తీర్పులపై, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించడానికి మాత్రం ఆయనకు సమయముండదు. హేమంత్ సోరెన్ ట్వీట్ చదవడానికి మాత్రం జగన్ రెడ్డికి సమయం ఉంటుంది. ఈయన చంద్రబాబుపై తప్పుడు కేసులుపెట్టిస్తాడా? ముందు ఈయనపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. తన నిర్లక్ష్యంతో వందలమంది చావులకు కారణమవుతున్నాడు కాబట్టి, ఈ ముఖ్యమంత్రిపై క్రిమినల్ కేసుపెట్టి, లోపలేయాలి. ప్రధానిని ధైర్యంగా మాకు ఇవికావాలి.. మాప్రజలను కాపాడ టానికి సహకరించండని అడిగే ధైర్యంలేదుగానీ, హేమంత్ సోరెన్ ట్వీట్ ను తప్పుపడతాడు. చంద్రబాబునాయుడు ఎన్ 440కే గురించి ఏంమాట్లాడారు. ఆయన అన్నదానిలో తప్పేముంది? ఈ ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రజలకోసం మీడియా ముందుకొచ్చి మాట్లాడాడా? ఎలాగూ తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాడు. కనీసం మీడియా ద్వారానైనా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాడా? మాట్లాడితే తన జీతగాడిని పంపిస్తాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనా లేక, ఆయన జీతగాడా? చంద్రబాబుగారు జాగ్రత్తలు చెబితే, ఆయనపై కేసులు పెడతారా? చంద్రబాబుపై పెట్టిన కేసుకు, రేపు డీజీపీ సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాలి. ఈముఖ్యమంత్రి , డీజీపీ సుప్రీంకోర్టుకి ఏంచెబుతారో చూద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read