ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మలుపులు మీద మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం కుదరదని, కోర్టుకు ఎక్కాయి. అయితే మొన్నటి దాకా క-రో-నా అధికంగా ఉంది అంటూ, అందుకే ఎన్నికలు పెట్టలేం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు మరో కొత్త కారణంతో, కోర్టు ముందుకు వచ్చి, వాదన వినిపించింది. దీని పై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, ఫిబ్రవరిలో జరిగే స్థానిక ఎన్నికల పై విచారణ జరిగింది. ఈ పిటీషన్ రాష్ట్ర ప్రభుత్వం రెండు వారల కిందట దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులు ఆపేయాలని, ఎన్నికల నిర్వహణ పై స్టే ఇవ్వలేని కోరింది. అయితే తాము ఎన్నికల తేదీల పై జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఈ కేసు ఈ రోజు మళ్ళీ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కేసు విచారణలో అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం, అడిషనల్ అఫిడవిట్ రూపంలో దాఖలు చేసింది. ఈ అడిషనల్ అఫిడవిట్ లో ఈ సారి తెర మీదకు కొత్త విషయం తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కో-వి-డ్ వాక్సిన్ మార్గదర్గశక సూత్రాలను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఇందులో మూడు అంశాలను ప్రధానంగా ప్రభుత్వం ప్రస్తావించింది. మొదటిది, వాక్సిన్ వేయటానికి, పోలీస్ తో పాటు, అన్ని డిపార్టుమెంటు సిబ్బంది పాల్గునాల్సి ఉందని, వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వాక్సిన్ వేయబోతున్నాం అని తెలిపింది.

hc 1512020 2

దీనికి సంబంధించి, కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చిందని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ లో పేర్కొంది. పైగా జనవరి, ఫిబ్రవరిలో జరగనున్న వాక్సినేషన్ కు, పోలీస్ సిబ్బందితో పాటు, అన్ని డిపార్టుమెంటు ల సహాయం కావాలని, తెలిపింది. మొదటి డోస్ వేసిన తరువాత, నాలుగు వారాలకు రెండో డోస్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అందు వల్ల ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని, ముఖ్యంగా ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకుని, ఎన్నికల కంటే, ఈ వాక్సినేషన్ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా చేయాలో, అదే విధంగా వాక్సిన్ ప్రక్రియ కూడా చేయాలని కోర్టుకు తెలిపింది. అయితే దీనికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ రాత్రి అందింది అని, పరిశీలించి కౌంటర్ వేయటానికి సమయం కావాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేయగా, ఈ కేసుని వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరి దీని పై ఈసి ఏమి చెప్తుందో, కోర్టు ఏమి అంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read