ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రాజధాని అమరావతిని, ఇప్పటికే 10 వేల కోట్లు ఖర్చుపెట్టి, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ ఉన్న రాజధానిని, మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం తీసుకుని దగ్గరి దగ్గర ఏడాది అవుతున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తాను అనుకున్నది చేయలేక పోతున్నారు. ఒక పక్క అమరావతి మహిళలు, రైతుల పోరాటం ఒక వైపు అయితే, మరో పక్క న్యాయపోరాటంలో, వైసీపీకి చిక్కులు తప్పటం లేదు. కొన్ని పిటీషన్లలో అయితే, ఏమని సమాధానం చెప్పాలో తెలియక తిప్పలు పడుతూ, వాయిదాలు కోరుతున్నారు. ఇక విషయానికి వస్తే, గతంలో చంద్రబాబు హయాంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ అనేది చాలా చిన్నదిగా ఉండటంతో, ఎయిర్ పోర్ట్ విస్తరణ బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గా కూడా మార్చేసారు. అయితే మరింత భూమి కావాల్సి రావటంతో, గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టు పక్కల భూములు కోసం ప్రయత్నాలు చేసారు. అక్కడ ప్రజలు ముందుగా ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ చాలా విలువైన భూమి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తక్కువగా ఉంటుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం, వినూత్నంగా, ఇక్కడ భూములు ఇస్తే, అమరావతి రాజధానిలో భూములు ఇస్తాం అంటూ, ఒప్పందం చేసుకోవటంతో, రైతులు ముందుకు వచ్చారు. మనకంటూ అమరావతిలో భూమి ఉంటుందని ఆశ పడి, ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వీరిలో సినీ నిర్మాత అశ్వినీదత్, అలాగే ప్రముఖ హీరో కృష్ణంరాజు కూడా తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చారు.

aswinidutt 10112020 2

అయితే ఇప్పుడు అమరావతిని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిర్వీర్యం చేయటంతో, రేట్లు పడిపోయాయి. అందుకే ఇప్పుడు అశ్వినీదత్ కోర్టుకు వెళ్లారు. తాను 39 ఎకరాలు ఎయిర్ పోర్ట్ కోసం ఇచ్చానని, అగ్రిమెంట్ ప్రకారం అమరావతిలో భూములు ఇస్తాం అన్నారని, అయితే ఇప్పుడు అక్కడ రాజధాని వెళ్ళిపోతుంది కాబట్టి, తమకు పరిహారం ఇప్పించాలని, కోర్టులో కేసు వేసారు. అయితే గతంలో ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయటానికి సమయం ఇచ్చింది కోర్టు. నిన్న ఈ కేసు విచారణకు రాగా, తమకు మరింత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. అగ్రిమెంట్ కు లోబడి ఉండాలి అంటూ, కోర్టు ఈ పిటీషన్ ని నవంబర్ 17కు వాయిదా వేసింది. అయితే అగ్రిమెంట్ పక్కాగా ఉండటంతో, ప్రభుత్వం కౌంటర్ ఇవ్వటానికి ఇబ్బంది పడుతుందేమో అని విశ్లేషకులు అభిప్రయపడుతున్నారు. పరిహారం ఇవ్వాల్సి వస్తే భారీగా ఇవ్వాల్సి ఉంటుందని, ఇప్పటి వరకు అమరావతి రైతులు ఇక్కడ నుంచి అమరావతి తరలించవద్దు అంటూ న్యాయ పోరాటం చేస్తున్నారని, తమ అగ్రిమెంట్ ప్రకారం పరిహారం కావాలని వారు కూడా కోరితే, 33 వేల ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఇవన్నీ తెలిసే ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేస్తుందా ? ప్రభుత్వం ఏమని వాదనలు వినిపిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read