ఆంధ్రప్రదేశ్ర్ రాజకీయాలను నిన్నటి నుంచి కుదిపేస్తున్న అంశం, రూ.41 వేల కోట్లకు పైగా నిధులను సరైన బిల్లులు లేకుండా, ప్రభుత్వం చెల్లించింది అంటూ టిడిపి నిన్న వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేయటం. నిన్నటి నుంచి ఈ అంశం పై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతో దీని పై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసారు. నిన్న టిడిపి గవర్నర్ వద్దకు వెళ్లి, ఆర్ధిక శాఖ జమా ఖర్చుల్లో భారీ తేడాలు ఉన్నాయి అంటూ, కాగ్ లేవనెత్తిన అంశాలను ఆయనకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుకు సంబంధించి, వివిధ పత్రికల్లో కధనాలు వచ్చాయని, అందులో వాస్తవాలు ఏమి లేవు అంటూ, ఆర్ధిక శాఖ ప్రెస్ నోట్ లో తెలిపింది. 41 వేల కోట్ల జమా ఖర్చులకు సంబంధించి, అకౌంటింగ్ పద్ధతులు, ట్రెజరీ నిబంధనలు పట్టించుకోకుండా నిధులు బదిలీ చేసినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని వారు పేర్కొన్నారు. ప్రతి ఏడాది ప్రినిసిపాల్ ఎకౌంటు జనరల్ తాము చూసిన, అబ్సర్వేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చేస్తారని, ఇందులో భాగంగానే, మే 4న తమకు లేఖ వచ్చిందని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక శాఖ ఆ లేఖ పై ఇప్పటికే వివరణ కూడా ఇచ్చాం అంటూ పేర్కొన్నారు. స్పెషల్ బిల్స్ క్యాటగరీ కింద 10 వేలకు పైగా బిల్లులకు సంబంధించి, 41 వేల కోట్లు డ్రా చేసిన విషయం పై ఇప్పటికే కాగ్ కు వివరణ ఇచ్చినట్టు చెప్పారు.

cag 09072021 2

అయితే ఎలా డ్రా చేసారు, ఏమిటి అనే దాని పై కూడా చెప్తూ, ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ లో జరిగిన పొరపాటులని వివరణ ఇచ్చారు. పీడీ అకౌంట్స్ కు విడుదల చేసిన ఫండ్స్ కు సంబంధించి, ఆర్ధిక ఏడాది చివరని , అవి ఉపయోగించుకోలేక పోవటం వలన, అవి ల్యాప్స్ అయ్యాయని, అవి చూపించక పోవటం కూడా, లెక్కల్లో తేడా రావటానికి కారణంగా చెప్పారు. పీడీ అకౌంట్స్ మధ్య అడ్జస్ట్మెంట్స్ కూడా చేసామని, దాని వల్ల కూడా తేడా కనిపించిందని చెప్పారు. ఎకౌంటు హెడ్స్ లో కూడా పొరపాటులు జరిగాయని, అందులో కూడా తేడా ఉందని చెప్పారు. ఫెయిల్ అయిన పేమెంట్స్ మళ్ళీ చేయకపోవటం వల్ల కూడా ఈ సమస్య కు మరో కారణంగా చెప్పారు. GSTINlలో రెగ్యులర్ బిల్లులకు టీడీఎస్ అడ్జస్ట్మెంట్ రికవరీలో కూడా తేడాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఏకంగా 41 వేల కోట్లకు సంబంధించి, ఇన్ని తేడాలు ఎలా జరిగాయి, దీనికి ఎవరు బాధ్యలు, ఈ తప్పులు అసలు ఎందుకు జరిగాయి అనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. మరి ఇంతకీ ఈ వివరణతో కాగ్ ఏమి అంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read