ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు ప్రభుత్వం మధ్య , ఇప్పటి వరకు నేలకొన్న ప్రతిష్టంభన వీడే అవకాసం ఉందని, సమాచారం వస్తుంది. ప్రధానంగా ఉద్యోగుల ఆందోళన పై ప్రభుత్వం, ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. కొద్ది సేపటి క్రితం సియం ఆఫీస్ నుంచి, అధికారులు, మంత్రులు కమిటీలో ఉన్న మంత్రులు ఎక్కడ ఉన్నారో ఆరా తీసి, వారిని పిలిపిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా, ఉద్యోగులు పేర్కొంటున్న అంశాలు అయినా, హెచ్ఆర్ఏ ఉద్యోగులు కోరినట్టుగా కానీ , కొంచెం దగ్గరగా కానీ, కొన్ని కొత్త స్లాబులని ఏర్పాటు చేయటం, అలాగే డీఏ ఎరియర్స్ నుంచి తొమ్మిది నెలల ఐఆర్ ను మినహాయంపు ఇవ్వటం వలన, ప్రభుత్వానికి ఎదురు చెల్లించటం పై కూడా ఉద్యోగులు అభ్యంతరం చెప్తున్నారు. దీనికి ప్రత్యామ్న్యాయ మార్గాలు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే విధంగా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, 70 ఏళ్ళకు 10 శాతం, 75 ఏళ్ళకు 15 శాతం, 80 ఏళ్ళ తరువాత 20 శాతం ఇచ్చే అడిషినల్ క్వాంటం అఫ్ పెన్షన్ లో 70, 75ఏళ్ళ స్లాబ్ ని ప్రభుత్వం తొలగించింది. దీన్ని మళ్ళీ ఇవ్వాలని కూడా ప్రభుత్వంలో ఆలోచన జరుగుతుందని చెప్తున్నారు. ఈ సమాచారం ఉద్యోగులకు చేరటంతో, ఈ రోజు జరుగుతున్న ఉద్యోగు సంఘాల సమావేశంలో కూడా ఈ విషయాల పై చర్చిస్తున్నారు.

sajjala 31012022 2

ప్రభుత్వం పై ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా కూడా, మూడు అంశాల మీద ఏదైతే పట్టుబడుతుందో, అసితోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయట పెట్టటం, పీఆర్సి జీవోలు రద్దు చేయటం, అదే విధంగా గత నెలకు పాత జీతం వేయాలని చెప్పటం, ఈ మూడు డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వస్తాం అని చెప్పారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు లీకులు ఇవ్వటంతో, దీని పై ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని పై ఆలోచిస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 3న తలపెట్టే చలో విజయవాడ కార్యక్రమం పై, ఎలా చేయాలి అనే అంశం పై కూడా చర్చిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం ఇలా లీకులు ఇస్తూనే, కొత్త పీఆర్సి ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయాలని, ఆదేశాలు ట్రెజరీ అధికారులకు మరోసారి హుకుం జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం లోపు బిల్లులు మొత్తం పూర్తి చేయాలని గట్టిగా ఆదేశాలు జారీ చేసారు. ఒక వైపు చర్చలు అంటూనే, పీఆర్సి విషయంలో మాత్రం, కొత్త జీతాలతో వేయాల్సిందే అని అంటున్నారు. చలో విజయవాడ పెద్ద ఎత్తున జరుగుతుంది అనే సమాచారం ప్రభుత్వానికి రావటంతోనే, ఉద్యోగులను సైలెంట్ చేసే పనిలో ఉన్నారు. మరి ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read