బంగాళాఖాతంలో పెథాయ్ తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో పెథాయ్ తుఫాను కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు సాయంత్రానికి విశాఖ-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుఫాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతోందని పేర్కొంది. మరో పక్క, తుపాను రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. పంట చేతికొచ్చే దశలో ఎలాంటి నష్టాన్ని సృష్టిస్తుందో అనే ఆందోళన వారిని కలవరపరుస్తోంది. శుక్ర, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో మబ్బులు పట్టడంతో అన్నదాతలు పొలాలకు పరుగులు తీశారు. కోసి ఓదెలు వేసిన వరిని.. ఆగమేఘాల మీద కుప్పలు వేయించే పనుల్లో నిమగ్నమయ్యారు. మిరప, ఇతర పంటలు కాపాడుకునే పనిలో కొందరు.. టార్పాలిన్లు తెచ్చుకునే పనిలో మరికొందరు మునిగారు.
అయితే రైతుల నుంచి రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు ఫోన్ లు వెళ్తున్నాయి. ఆధునిక యంత్రాలు కావలని, తొందరగా వరి కోతల యంత్రాలు, కల్లాల్లోనే ధాన్యం తడిసిపోకుండా పట్టాలు కావాలని కోరటంతో, సాధ్యమైనంత మేర, ఆ యంత్రాలను కావలసిన చోటుకి పంపిస్తున్నారు. మరో పక్క పట్టాలు కావలసిన వారు, దగ్గరలోనే వ్యవసాయ శాఖ ఆఫీస్ కి వెళ్తే, అక్కడే పట్టాలు ఇస్తారని, రైతులు తెచ్చుకోవచ్చిని చెప్పారు. చంద్రబాబు తీసుకుంటున్న ఈ చర్యలు, సోషల్ మీడియాలో చుసిన, ఇతర రాష్ట్రాల వారు చంద్రబాబుని అభినందిస్తూ, ట్వీట్లు పెట్టారు. మరో పక్క పునరావాస కేంద్రాలు, ఆహరం, తాగునీటి సౌకర్యార్థం వాటర్ పాకెట్స్ బస్తాలు సిద్ధం చేసారు. రెవిన్యూ, పంచాయతీ రాజ్ ,పోలీస్ ,మెరైన్ పోలీస్, మత్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుత సార్వా సీజన్‌లో ఎక్కువ మంది పంట నూర్పిడికి వరికోత యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే, కొంత మంది రైతులు పశుగ్రాసం కోసం వరిగడ్డిని నిల్వ చేసుకోవడానికి కూలీలతో కోత కోయించి పనలపై ఆరబెట్టిన తరువాత కుప్పనూర్పిళ్లు చేయిస్తున్నారు.
ఈ విధంగా డెల్టా ప్రాంతంలో సుమారు 50 వేల ఎకరాల్లో పంట పనలపైనే ఉంది. ఈ తుఫాన్‌కు పంట తడిసిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు కూలీలను ఉపయోగించి నూర్పిళ్లు చేయించడానికి పరుగులు పెడుతున్నారు. కనీసం వరి పననలకు గట్టుకు చేర్చుకుని కుప్పగా వేసి వాతావరణం అనుకూలించాక నూర్పిడి చేయించుకోవచ్చనే ఆలోచనతో కుప్పలు, నెట్టు కట్టడం వంటి పనుల్లో మనిగిపోయారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం, విజయనగరం, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో పత్తి గణనీయంగా సాగైంది. అయితే ప్రస్తుతం తుఫాన్ ప్రభావం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పత్తి తీతలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పత్తి కాయలు పగిలి తీతకు సిద్ధంగా ఉన్నాయి,. ఈ నేపద్యంలో తుఫాన్ వార్త పత్తి రైతుకు కాలాడకుండా చేస్తుంది. త్వరగా పత్తి తీయాలని కూలీలకోసం అధిక రేట్టు ఇస్తామన్నా దొరికే పరిస్థితి లేకుండా పోయింది . ఇప్పటి వరకూ 70 శాతం మేర పత్తి తీతలు పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం తీత సమయంలో ఈ తుఫాన్ పత్తి రైతు పాలిట శాపంగా మారింది. దేవుడు దయ వల్ల, తక్కువ నష్టంతో ప్రజలు బయట పడాలని కోరుకుంటున్నారు.