పోలవరం ప్రాజెక్ట్ పై అటు హైకోర్ట్, ఇటు కేంద్ర ప్రభుత్వం, కొత్త టెండర్ కు వెళ్ళవద్దు, నవయుగని కొనసాగించండి అని చెప్తున్నా కూడా, జగన్ ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రాతిపక్షంగాలో ఉండగా పోలవరం ప్రాజెక్ట్ పై అనేక అవినీతి ఆరోపణలు చేసారు. కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేసి డబ్బులు ఇస్తూ ఉండే ప్రాజెక్ట్ లో, చంద్రబాబు అవినీతి చేసారంటే ఎవరూ నమ్మరని తెలిసినా, రాజకీయ ఆరోపణలు చేసారు. ఇందుకు తగ్గట్టుగానే, ఆయన అధికారంలోకి రాగానే, ఒక కమిటీ చేసారు. ఈ కమిటీ అధ్యనయం చేసి ప్రాజెక్టులో అదనంగా రూ. 36వేల 600 కోట్లు వ్యయం చేశారని నివేదికలో సమర్పించింది. అయితే ఇంత అవినీతి జరిగితే, ఎవరైనా అరెస్ట్ లు చేసి, సిబిఐ కి ఇచ్చి విచారణ చెయ్యటం కాని, కోర్ట్ లకు వెళ్ళటం కాని చేస్తారు. నిజంగానే ఇంత అవినీతి జరిగితే చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారిని అరెస్ట్ చెయ్యాల్సిందే.
కాని, ఈ నివేదిక ఆధారంగా అరెస్ట్ లు, కేసులు ఏమి పెట్టలేదు కాని, పోలవరం ప్రాజెక్ట్ లో హెడ్ వర్క్స్‌లో మిగిలిపోయిన పనులను చేపట్టొద్దని, నిర్మాణ బాధ్యత నుంచి వైదొలగాలని నవయుగకు నోటీసులు ఇచ్చి పంపించారు. అంతేకాదు హైడల్ ప్రాజెక్టు నిర్మాణం కూడా చేపట్టొద్దని ఏపీ జన్‌కో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైడల్ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ జన్‌కో జారీ చేసిన ఉత్తర్వులపై నవయుగ హైకోర్టును వెళ్ళింది. అన్నీ పరిశీలించిన హైకోర్టు ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, రివర్స్ టెండరింగ్ కు ముందుకెళ్లొద్దని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 4వ తేదికి వాయిదా వేసింది.
మరో పక్క, హెడ్ వర్క్ విషయంలో కూడా నవయుగను తప్పించటం పై కేంద్రం, ఏపి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నవయుగా వచ్చిన తరువాతే పనులు పరుగులు పెడుతున్నాయని, ఇప్పుడు కొత్త టెండర్ పిలిస్తే, ఖర్చు ఎక్కువ అవుతుంది, పనులు లేట్ అవుతాయని చెప్పింది. అయితే అటు హైకోర్ట్, ఇటు కేంద్రం వద్దు అంటున్నా, జగన్ ముందుకే అంటున్నారు. కోర్ట్ తీర్పు ఉన్నా సరే, టెండర్ పై ముందుకే వెళ్తున్నారు. టెండర్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 17న జారీ చేశామని, అయితే హైకోర్టు ఆగస్టు 22వ తేదీన ఆదేశాలు ఇచ్చిందని చెప్తూ, తాజాగా నోటిఫికేషన్ షెడ్యూల్ సాప్ట్‌వేర్‌ను ఆన్లైన్ లో అప్‌లోడ్ చేసింది. టెండర్ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంటుందని, కోర్ట్ ఆదేశాల ప్రకారం అప్పుడు చుస్తామంటూ పభుత్వం అంటుంది. అయితే, ఒక పక్క హైకోర్ట్ సింగల్ బెంచ్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, డివిజన్ బెంచ్ దగ్గర కేసు పెండింగ్ లో ఉన్న సమయంలో ఇంత దూకుడుగా ప్రభుత్వం వెళ్ళటం, కోర్ట్ ధిక్కరణ అవుతుందని, ప్రభుత్వానికి మరోసారి కోర్ట్ ద్వారా మొట్టికాయలు తప్పవని లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.