మృతదేహానికి పోస్టుమార్టం చేయడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ చేసిన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, ఫోరెన్సిక్ విభాగం వైద్యుడు డాక్టర్ శ్రీను నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మొన్న జరిగిన ఘటన పై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. 24 గంటలు తిరక్కుండానే లంచం డిమాండ్ చేసిన వైద్యుడిని సస్పెండ్ చేస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు సోమవారం సాయంత్రం ఉత్త ర్వులు విడుదల చేశారు. విజయవాడలోని అయోధ్యనగర్ కు చెందిన ఆటో డ్రైవరు శివప్రసాద్ వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గత శనివారం సాయంత్రం శివప్రసాద్ చనిపోయారు.

vij 28082018 2

ఆయన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి.శ్రీనునాయక్ రూ. 5 వేలు లంచం డిమాండ్ చేశారు. నిరుపేదలమైన తాము లంచం ఇచ్చుకోలేమని బాధితులు ప్రాధేయపడితే.. చంద్రన్న బీమా పథకం కింద రూ. 5 లక్షలు వస్తుందిగా. అందులో రూ. 5 వేలు మాకివ్వలేరా? అంటూ వైద్యుడు ఎదురు ప్రశ్నించారు. తాను అడిగినంత లంచం ఇవ్వకుంటే మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఇస్తానంటూ డాక్టరు బెదిరించడంతో బాధితులు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును ఆశ్రయించారు. ఆయన వెంటనే ఆసుపత్రికి వచ్చి పోస్టుమార్టం విభాగంలో వైద్యుడిని, సిబ్బందిని గట్టిగా మందలించిన తర్వాతగాని శివప్రసాద్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు.

vij 28082018 3

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న ఈ అవినీతి వ్యవహారం పై యంత్రాంగం స్పందించింది. జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఈ ఘటన పై వీడియో ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. మరోవైపు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శశాంక్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.బాబూలాల్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, డాక్టర్ నాంచారయ్య తదితరులు సమగ్ర విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి నివేదించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య సమక్షంలో చర్చించి లంచం డిమాండ్ చేసిన డాక్టరు శ్రీనునాయక్ ను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే డీఎంఈ సస్పె న్షన్ ఉత్తర్వులను విడుదల చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read