మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం రోజుకి ఒక మలుపు తిరుగుతుంది. పోయిన వారం హైకోర్టు లో, ప్రభుత్వం పై వేసిన కోర్టు ధిక్కరణ కేసు సందర్భంగా, కోర్టు ఆదేశాలు ఇస్తూ, నిమ్మగడ్డను వెంటనే గవర్నర్ ని కలిసి, హైకోర్టు ఆదేశాలు గవర్నర్ కు విన్నవించాలని, ఆదేశించింది. దీంతో ఈ రోజు నిమ్మగడ్డకు, అపాయింట్మెంట్ ఇచ్చారు, గవర్నర్. గవర్నర్ నిమ్మగడ్డ భేటీ తరువాత, ఎలాంటి నిర్ణయం వస్తుంది అని అందరు అనుకుంటున్న టైంలో, మరో ట్విస్ట్ నెలకొంది. రమేష్ కుమార్ నియామకం, ఇక గవర్నర్ చేసేస్తారు అని అందరు అనుకుంటున్న టైంలో, రమేష్ కుమార్ నియామకం జరగకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రభుత్వం, మరో ప్రయత్నంతో ముందుకు వచ్చింది. రమేష్ కుమార్ గవర్నర్ ను కలుస్తూ ఉండగా, హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ పై స్టే ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
మేము ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పై పిటీషన్ దాఖలు చేసామని, అది అమలులో ఉండగానే, హైకోర్టులో దక్కరణ పిటీషన్ వేసారని, దీని పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే, తమ పిటీషన్ నిరర్ధకం అవుతుంది అంటూ, సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇలాంటి సందర్భంలో, నిమ్మగడ్డ వేసిన పిటీషన్ పై హైకోర్టు ముందుకు వెళ్ళటం, భావ్యం కాదు అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 8న తమ పిటీషన్ సుప్రీం కోర్టు కు ముందుకు వచ్చిన సమయంలో, నాలుగు వారాల తరువాతకి సుప్రీం కేసును వాయిదా వేసిందని, ఈ సందర్భంలో, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి నిమ్మగడ్డను మళ్ళీ పదవిలోకి వెళ్ళకుండా, ప్రభుత్వం చేస్తున్న చివరి ఎత్తు ఫలిస్తుందో లేదో చూడాలి.