ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా రూ.48 వేల కోట్ల గోల్ మాల్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఒకే ఏడాదిలో జరిగిన దోపిడీ ఇది. లెక్క పక్కా లేకుండా చేసిన ఖర్చు, ఇష్టం వచ్చినట్టు చేసిన చెల్లింపులు, నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేసి, చివరకు రూ.48 వేల కోట్లు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ వివరాలు అన్నీ కాగ్ బయట పెట్టింది. తాము వివరణ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కాగ్ తన రిపోర్ట్ లో పెట్టింది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రతిపక్ష తెలుగుదేశం, ఈ అంశం పైన విరుచుకు పడింది. ఇక మీడియాలో కూడా అనేక కధనాలు వచ్చాయి. రూ.48 వేల కోట్లు ఏమయ్యాయి అనే ప్రశ్న అన్ని వైపుల నుంచి వస్తుంది. అయితే అనూహ్యంగా ఈ ప్రశ్నలు మూడు రోజుల నుంచి కోడై కూస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి వివరణ రాకపోవటంతో, అందరూ షాక్ తిన్నారు. ఇంత పెద్ద సమస్య పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు ? అందరూ అన్ని విపుల నుంచి విమర్శలు చేస్తున్నా, ఎందుకు మౌనంగా ఉంటున్నారు ? వీటికి బదులు ఇవ్వటం మొదలు పెడితే, తమ గుట్టు మొత్తం బయట పడి, అసలు దాచిన విషయాలు అన్నీ బయట పడతాయని జగన్ ప్రభుత్వం భావిస్తుందా ?
తాము చేసిన ఆర్ధిక విధ్వంసం బయట పడుతుందని, జగన్ భయ పడుతున్నారా ? తమ గుట్టు మొత్తం బయట పడుతుందనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, వీటికి సమాధానం చెప్పటానికి భయపడుతుందని అర్ధం అవుతుంది. లోతుగా పరిశీలన చేస్తే, ఈ విషయంలో అతి పెద్ద స్కాం బయటకు వచ్చే అవకాసం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పధకాల నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, దొంగ యుసిలు ఇచ్చి, ఈ నిధులు తెచ్చుకున్నారు. అయితే ఆ పధకాలకు సంబంధించి బిల్లులు మొత్తం పెండింగ్ లోనే ఉన్నాయి. ఒక పక్క యుసిలు ఇచ్చేసి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి అంటే, కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఆ పధకాలకు కాకుండా, వేరే దేనికో మళ్ళించారు కాబట్టే. ఇక అప్పుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లో భారీ అవకతవకలు జరిగాయి. మరో పక్క పీడీ ఖాతాల వినియోగంలో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. సస్పెన్స్ ఖాతా వినియోగం కూడా ఎడా పెడా చేసారు. ఈ మొత్తం వ్యవహారాల పై వివరణ ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం ఎందుకో మరి సిద్ధంగా లేదు.