సహజంగా ఎవరైనా తప్పు మాట్లాడితే, వారిని ఎవరైనా మందిలిస్తారు. కాని నువ్వు నాన్ను ఎందుకు అంటున్నావ్, అని అడిగిన వారిని మందిలించటం, మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. మొన్న మన స్పీకర్ తమ్మినేని గారు మాట్లాడుతూ, నేను స్పీకర్ గా చెప్పటం లేదు, ఎమ్మెల్యేగా చెప్తున్నా అంటూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... అంతకు ముందు కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై లోకేష్ స్పందిస్తూ, స్పీకర్ కు ఒక బహిరంగ లేఖ రాసారు. మీరు చేసిన వ్యాఖ్యలు స్పీకర్ స్థానానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి అంటూ, లేఖలో పెర్కున్నారు. అలాగే, తన పై, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ కు సవాల్ విసిరారు లోకేష్ తన పై చేసిన ఆరోపణలు నిరూపించాలని, నిరూపిస్తే, నేను రాజీనామా చేస్తా, లేకపోతె మీరు ఏం చేస్తారు అంటూ, లోకేష్ ఛాలెంజ్ చేసారు.

lokesh 14112019 2

అయితే, దీని పై వైసిపీ స్పందించింది. స్పీకర్ ని అలా ఎలా అంటారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, లోకేష్ కు నోటీసులు ఇస్తాం అంటుంది వైసీపీ ప్రభుత్వం. స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా విమర్శలు చేసారు అంటూ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నాయకులకు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇస్తున్నామని, ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాకు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌, మాజీ విప్‌ కూన రవికుమార్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. నిన్న శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయం చెప్పారు. అసభ్య పదజాలంతో తెలుగుదేశం నేతలు స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ను దూషించారని, అన్నారు.

lokesh 14112019 3

ముఖ్యంగా లోకేష్, లేఖల రూపంలో స్పీకర్ ను చపర్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. నోటీసులే కాదని, ఈ ముగ్గురి పై, క్రిమినల్‌ చర్యల తీసుకునే విషయం పై కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. స్పీకర్ ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోదు అంటూ, వ్యాఖ్యలు చేసారు. అయితే, ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, అసలు వీళ్ళు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసారు అనే విషయం పై మాత్రం, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడలేదు. స్పీకర్ స్థానాన్ని అగౌరపరిస్తే, ఎవరి పైన అయినా చర్యలు తీసుకోవాల్సిందే, అందులో సందేహమే లేదు. కాని, అటు స్పీకర్ నేను ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా అంటూ, గుడ్డలూడదీస్తాం... మడిచి ఎక్కడో పెట్టుకో... కౌన్ కిస్కా గొట్టం గాళ్ళు అని వ్యాఖ్యలు చేసిన తరువాతే, టిడిపి నేతలు స్పందించారు. మరి ప్రభుత్వం నోటీసులు ఇస్తాం అంటున్న విషయం పై, స్పీకర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read