ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎవరైనా పోరాటం అంటే చాలు, హౌస్ అరెస్ట్ లు, నిర్బంధాలు, ముందస్తు అరెస్ట్ లు, బైండ్ ఓవర్ లు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఇలాగే ఉంది. నిన్నటి వరకు ప్రతిపక్షాలే టార్గెట్ అనుకుంటే, నేడు అధికార పక్షం, తమను ఎదురిస్తున్న ఉద్యోగులను కూడా అలాగే టార్గెట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్, ఉద్యోగులు, అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరి పై కూడా, రాష్ట్ర ప్రభుత్వం చలో విజయవాడ నేపధ్యంలో పూర్తి నిఘా పెట్టింది. చలో విజయవాడ కు రాష్ట్రం నలు మూలాల నుంచి వచ్చే వారిని ఎక్కడికక్కడే నిలిపి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు గత రాత్రి నుంచి ఉద్యోగ సంఘాల నేతల కు నోటీసులు ఇస్తూ, ఎక్కడికీ వెళ్ళటానికి లేదని ఆదేశాలు జారీ చేసారు. విజయవాడ దగ్గరగా ఉండే జిల్లాల్లో, గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేసి, ఉద్యోగులను నిర్బందిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ పోలీసులు అనుమతి లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కరోనా నేపధ్యంలో పర్మిషన్ ఇవ్వలేమని పోలీసులు తేల్చి చెప్పారు. అయితే ఈ చలో విజయవాడకు , దాదపుగా 2 నుంచి 3 లక్షల మంది వస్తున్నారు అనే సమాచారం ఉండటంతో, ప్రభుత్వంలో దడ మొదలైంది.

govt 020202022 2

అందుకే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం దిగింది. చివరకు టాక్సీ డ్రైవర్లను, ట్రావెల్స్ బస్సులు వారిని కూడా, పోలీసులు బెదిరించారు. అలాగే రైల్వే స్టేషన్ లో, కూడా గట్టి నిఘా పెట్టారు. హైవేల పై కూడా కారులు అన్నీ చెక్ చేస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో పోలీసులు నిఘాలు పెట్టారు. అన్ని వైపులా చెక్ పోస్ట్ లు పెట్టారు. ఇక ర్యాలీ నిర్వహించే విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్సు ని ప్రభుత్వం పెట్టింది. ఉద్యోగుల ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటానికి ప్రభుత్వం కుట్రలు పన్నింది. ఇందులో వార్డ్ వాలంటీర్లను కూడా ప్రభుత్వం ఉపయోగించింది. చివరకు నిఘా కూడా వాలంటీర్లకు ఇవ్వటం పై, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రభుత్వం కూడా, రేపు ఉద్యోగులకు ఎలాంటి సెలవు ఉండదు అని, పెట్టటానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు సాయంత్రం నుంచి ఉద్యోగ సంఘ నేతలను అరెస్ట్ కూడా చేస్తారని తెలుస్తుంది. మొత్తంగా రేపు ఈ చలో విజయవాడ ఎటు దారి తీస్తుందో, ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read