అమరావతికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ లో వేసిన నాలుగు పిటిషన్లను కొట్టేసిన సంగతి తెలిసిందే... అయితే, ఈ విషయంలో ప్రభుత్వం సమర్ధవంతమైన వాదనలు వినిపించింది... డేటా మొత్తం ట్రైబ్యునల్‌ ముందు ఉంచింది... దీంతో వాటితో ఏకీభివించిన ట్రైబ్యునల్‌, అవతలి వారు కుట్రలను తిప్పి కొడుతూ, అమరావతికి లైన్ క్లియర్ చేసేంది... భూకంపాలు వస్తాయి అని, వరదలు వచ్చి అమరావతి మునిగిపోతుంది అని, లూజ్ సాయిల్ అని, అహార భద్రతకు ముప్పు అని, ఇలా టీవీల్లో, పేపర్ లో ఎలా భయపెట్టారో, అలాగే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌ ముందు పిటీషన్ వేశారు... కాని, అవన్నీ తప్పు అని, ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది...

green 19112017 2

ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరిగే ప్రాంతానికి వరదల భయం ఉందని అంటే, దీనికి సమాధానంగా గత వందేళ్లకు పైగా ఆ ప్రాంతంలో వచ్చిన వరదల వివరాలు తీసుకుని, అత్యధికంగా వరదలు వచ్చిన 1853లో పరిస్థితిపై అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం పేర్కొన్న అంశాలను ప్రభుత్వం ఎన్జీటీ ముందుంచింది. వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీకి ఇవతల కేవలం ఇబ్రహీంపట్నం వైపు మాత్రమే మునిగిందని, ప్రస్తుతం రాజధాని నిర్మించే ప్రాంతంలో ఎటువంటి వరద రాలేదని స్పష్టం చేసింది. అలాగే, భూకంప తీవ్రత జోన్‌-3లో ఉన్న అమరావతిలో రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ప్రాణనష్టం ఏర్పడొచ్చనే అంశాన్ని లేవనెత్తారు. అయితే ఇదే జోన్‌లో ఆగ్రా, అహ్మదాబాద్‌, భువనేశ్వర్‌, కోయంబత్తూర్‌, చెన్నై, కోల్‌కతా, ముంబై, పుణే, లక్నో, వారణాసి వంటి రాజధానులు, నగరాలు ఉన్నాయని ప్రభుత్వం తెలియజేసింది.

green 19112017 3

ఆమరావతి ప్రాంతంలో ఆహార ధాన్యాలు పండించే పంట భూములు తీసుకోవడంతో ఆహార సంక్షోభం ఏర్పడుతుందనే అంశానికి సమాధానంగా 2014-15లో అక్కడ సాగు చేసిన పంటల వివరాలు అందించారు. ఖరీఫ్‌లో 11242 హెక్టార్ల రాజధాని ప్రాంతంలో 1266 హెక్టార్లలో వరి సాగు చేశారని అది రాష్ట్రంలో జరిగే సాగులో కేవలం 0.027 శాతమేనని, దానివల్ల వరి ధాన్యానికి నష్టం వాటిల్లదని తేల్చింది. ఇలా ప్రతి అంశంపై పర్యావరణ హితంగా, ప్రజలకు అనుగుణంగా ఎలా ఉండాలనే దానిపై సమగ్ర వివరణ ఇవ్వడంతో అమరావతి నిర్మాణంలో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read