ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వరుసుగా కోర్టుల్లో పడుతున్న మొట్టికాయలు చూసి, రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీం పై, ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి, ఈ లీగల్ టీం వల్ల, అన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, ఈ లీగల్ టీంలో సరైన సమర్ధత ఉన్న వాళ్ళు లేరని, ఈ రోజు ఒక జాతీయ పత్రికలో కూడా కధనం వచ్చిన నేపధ్యంలో, వైసీపీ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే, సుప్రీం కోర్ట్ లో వేసిన ఒక పిటీషన్ విషయంలో, మరోసారి, ఈ లీగల్ టీం డొల్లతనం బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు కూడా ఢిల్లీ లెవెల్ లో పోయింది. నిమ్మగడ్డ కేసు విషయం, జగన్ మోహన్ రెడ్డి ఎంత పర్సనల్ గా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. డీ అంటే డీ అంటూ, నిమ్మగడ్డ విషయంలో ముందుకు వెళ్తున్నారు. హైకోర్ట్ లో వ్యతిరేక తీర్పు వచ్చినా సరే, సుప్రీం కోర్ట్ లో తేల్చుకుంటాను అంటూ, జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసింది.
అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో అన్నీ తప్పులే ఉన్నాయి. ఆ తప్పులు చూసి, సుప్రీం కోర్టులో ఉన్న లాయర్లు ముక్కున వేలు వేసుకున్నారు. నిమ్మగడ్డ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో, వాద, ప్రతి వాదులుగా, రెండు చోట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. కనీసం పరిజ్ఞానం కూడా లేదా అని, న్యాయ నిపుణులు, విస్మయం వ్యక్తం చేసారు. దీంతో పిటీషన్ లో తప్పులు ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం, పిటీషన్ ను వెనక్కు తీసుకుని, తప్పులు సరి చేసి, మరో పిటీషన్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. అలాగే దీంతో పాటుగా మరో 3 స్పెషల్ లీవ్ పిటీషన్లు కూడా దాఖలు చెయ్యనున్నారు. అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలియటంతో, ఆగ్రహం వ్యక్తం చేసారని, తెలుస్తుంది.