బీజేపీ నడిపిస్తున్న స్క్రిప్ట్ లో పావుగా మారి, పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ఎలా తిడుతున్నాడో చూస్తూనే ఉన్నాం... మోడీని ఒక్క మాట కూడా అనకుండా, రోజుకి ఒక మాట మాట్లాడుతూ, అవిశ్వాసం పెట్టమని ఒకసారి, అవిశ్వాసం ఎందుకు పెట్టారని మరోసారి, మంత్రులు రాజీనామా చెయ్యాలని ఒకసారి, మంత్రులు రాజీనామా చేస్తే ఏమి వస్తుంది అని మరో సారి, అఖిలక్షం పెట్టమని ఒకసారి, అఖిలపక్షం ఎందుకు అని మరోసారి, ఇలా బీజేపీ నడిపిస్తున్న స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూ, చంద్రబాబుని తిడుతూ కాలం గడిపేస్తున్నాడు... అయితే, బీజేపీ మాత్రం అనేక రకమైన ఆపరేషన్ లు చేస్తూ, రాష్ట్రంలో అనిశ్చితికి ప్రయత్నిస్తుంది అనే సమాచారం బయటకు వస్తుంది...
దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది... ఏ టైంలో, ఏ పరిస్థితి వస్తుందో, ఎలాంటి కుట్రలు పన్నారో అని అలోచించి, అలెర్ట్ అయ్యింది... పవన్ కల్యాణ్‌కు ఏపీ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. పవన్‌కు భద్రతగా ఉండేందుకు నలుగురు గన్‌మెన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. నలుగురు గన్‌మెన్లను రెండు షిఫ్ట్‌ల్లో ప్రభుత్వం కేటాయించింది.... గుంటూరు సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, రాష్ట్రాన్ని ఎంతో కించ పరుస్తూ, మోడీని ఒక్క మాట కూడా అనుకుండా పవన్ మాట్లాడుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, పవన్ కు బద్రత పెంచింది...
నిజానికి, రాజకీయ ప్రత్యర్థులకు భద్రత తగ్గిస్తారు... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇలాంటివి ఎన్నో చూసాం... అయితే ఇక్కడ పవన్ అన్ని మాటలు అంటున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం, ఇక్కడ పవన్ కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది... కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్ని రాష్ట్రంలో అల్లకల్లోలం సృస్టిస్తాయి అనే సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు అంటున్నారు... టీడీపీ రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి జరిపి ఆ నెపం ప్రభుత్వం మీద వేయొచ్చన్న భయమే తాజా నిర్ణయానికి కారణం కావొచ్చు అంటున్నారు.