ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. వివాదాస్పదం కూడా కాదు, ఈ నిర్ణయం పై, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ప్రభుత్వాలు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని, అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వాలు అయినా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అయినా, ఇంతే. తాము ఒక మతానికి దగ్గరగా, ఒక మతానికి దూరంగా చేసే పనులు చేయరు. మతాలకు సంబంధించి, ఎలాంటి నిర్ణయాలు అయినా ఆయా మత గురువులు, ట్రస్ట్ లు చేస్తూ ఉంటాయి. అవి ప్రభుత్వం పాటిస్తూ ఉంటుంది తప్ప, ప్రభుత్వం నేరుగా కలుగు చేసుకోరు. ఉదాహరణకు తిరుమల ఉంది. ప్రభుత్వం నేరుగా తిరుమల వ్యవహారాల్లో కలుగ చేసుకోదు. తిరుమల తీరుపతి బోర్డు, కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే రాజకీయ ప్రమేయం ఉన్న వాళ్ళను నియమిస్తారు అనుకోండి అది వేరే విషయం. ఎక్కడ ప్రభుత్వం నేరుగా వేలు పెట్టదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఒక చర్చి నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు అని, ఇప్పటికే టెండర్ పిలిచారు అంటూ, వైసీపీ ఎంపీ రఘురాంకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇలా చేయలేదని గుర్తు చేసారు.

secretariat 14122020 1

గుంటూరు జిల్లాలోని, రొంపిచర్ల మండల కేంద్రంలో, ఒక కొత్త చర్చి నిర్మాణం కోసం అని, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు టెండర్ పిలిచిందని అన్నారు. ఈ చర్చి నిర్మాణం కోసం ప్రభుత్వం, 8లక్షల 72వేల 663 రూపాయలు కేటాయించింది. అంతే కాకుండా, ఈ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి చేయాలని కోరారు. అయితే ఇక్కడ చర్చి నిర్మాణం విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ, ప్రభుత్వం ఈ పని చేయటం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్వయంగా ఏ దేవాలయం కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ నిర్మాణం చేయదు. దేవాలయాలు అయితే తిరుమల లాంటి బోర్డులు, దాతలు నిర్మిస్తారు. చర్చిలు, మసీదులు కూడా వివిధ దాతలు ఇచ్చిన నిధులతో నిర్మిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం ఒక మతం వైపు మొగ్గు చూపుతుందని, విమర్శలు వస్తున్న వేళ, ఈ చర్యను ప్రభుత్వం ఎలా సమర్దిస్తుందో చూడాలి. గతంలో ప్రభుత్వం మూడు చర్చిల నిర్మాణం కోసం, జీవోలు విడుదల చేసింది. అయితే ఇప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మాత్రం, టెండర్ పిలిచారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read