ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ రోజు రోజుకూ పెరుగుతుందో. జనవరి నెల జీతాలు, ఫిబ్రవరి ఒకటో తారీఖున, కొత్త పీఆర్సి ప్రకారం వేయాలని, ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగుల పై ఒత్తిడి తెస్తుంది. వాళ్ళు మాత్రం, తాము పాత పీఆర్సి ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేస్తామని అంటున్నారు. అయితే ఈ రోజు ప్రభుత్వం వారికి వార్నింగ్ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని, వార్నింగ్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్యోగ సంఘాలు, తమకు పాత పీఆర్సి ప్రకారమే జీతాలు వేయాలని, తమను బెదిరించి చర్యలు తీసుకుంటాం అంటే, ఇప్పుడే సమ్మెకు దిగుతాం అని వార్నింగ్ ఇస్తున్నారు. సచివాలయం ఉద్యోగులు ఈ రోజు కూడా మధ్యాహ్న నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఒక ర్యాలీగా సచివాలయం లో అన్ని బ్లాకులు తిరుగుతూ తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామి రెడ్డి కూడా మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భం గా ఆయన కొన్ని కీలక మైన వ్యాఖ్యలు చేసారు. సోమవారం నుంచి సచివాలయం లో కూడా రిలే నిరాహార దీక్షలు చేపడతామని ,ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

employees 27012022 2

ఈ నిరసన కార్యక్రమం ఈ నెల ఆఖరి వరకు జరుగుతాయని తెలిపారు . మరో వైపు ప్రభుత్వమేమో నిన్న అర్ధరాత్రి అధికారులకు లకు కొత్త PRCని అమలు చేసి ఫిబ్రవరి 1 వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఒక సర్కులర్ ఇచ్చింది . ఆ సర్కులర్ గురించి కూడ వెంకట రామి రెడ్డి తీవ్రంగా మండి పడ్డారు. పాత జీతాలే వెయ్యాలని కూడా ఆయన డిమాండ్ చేసారు. కొత్తగా జీతాలు వేస్తే మా ఉద్యమం ఆగదని కూడా ఆయన స్పష్టం చేసారు. సోమవారం నుండి రిలే నిరాహార దీక్షలకు పూర్తిస్థాయిలో సిద్దం అవ్వాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. ఈ కొత్త PRC తో ఉద్యోగుల జీతాలు తగ్గుతాయి అని చెప్పినా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన మండి పడ్డారు. ఇదే జీతాలు ఇస్తే గనుక ఉద్యోగులు జీవితాంతం నష్ట పోతారని ,ఈ ఉద్యమం చేయక పోతే మా భవిష్యత్ తరాలు కూడా నష్ట పోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రుల కమిటీ ఈరోజు స్టీరింగ్ కమిటీ కి పిలిచినప్పటి కూడా ఉదోగస్తులు తాము రావని కూడా తేల్చి చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read