జీవో నెంబర్ 2ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని వెకేట్ చేయాలని వేసిన పిటీషన్ ను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం, రాష్ట్ర హైకోర్టులో ఉపసమహరించుకుంది. ముఖ్యంగా పంచాయతీ సర్పంచ్, కార్యదర్శుల అధికారులను వీఆర్ఓలకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 2 ను సవాల్ చేస్తూ, అనేక మంది హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. అయితే గతంలో రాష్ట్ర హైకోర్టు ఈ జీవో నెంబర్ రెండు ని సస్పెండ్ చేస్తూ, నిర్ణయం వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, హైకోర్టులో ప్రభుత్వం వేసిన పిటీషన్, ఈ రోజు హైకోర్టులో జస్టిస్ గట్టు దేవానంద్ ధర్మసనం ముందు, విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్ గట్టు దేవానంద్, పలు కీలక ప్రశ్నలు సంధించారు. గతంలో ప్రభుత్వం వేసిన కౌంటర్ లో, సమంధిత మంత్రి జీవో నెంబర్ 2 లో పలు లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసి మళ్ళీ ఫ్రెష్ గా జీవో ఇచ్చే లోపు, కొంత మంది కోర్టుకు వెళ్ళారు అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించారు. మీరు కౌంటర్ లో ఈ విధంగా వ్యాఖ్యలు చేసి, ఆ వ్యాఖ్యలను ప్రస్తావించి, ఇప్పుడు మళ్ళీ జీవో నెంబర్ 2 ని సస్పెండ్ చేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని ప్రభుత్వం ఎలా పిటీషన్ వేస్తుందని హైకోర్టు ప్రశ్నించింది.
గతంలో వేసిన కౌంటర్ కు భిన్నంగా ఇప్పుడు పిటీషన్ వేయటం ఏమిటి అని హైకోర్టు ప్రశ్నించింది. రెండు కూడా కౌంటర్, పిటీషన్ రెండూ తేడాగా ఉన్నాయన్ పేర్కొంది. జీవో నెంబర్ రెండుని సస్పెండ్ చేసినప్పుడు అప్పట్లోనే, ప్రభుత్వం సంబంధిత శాఖా మంత్రి ఇచ్చిన వివరణను పత్రికల్లో వచ్చిన విషయాన్ని, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయియన్ క్లిప్పింగ్ ని కూడా, కౌంటర్ లో మీరకు పేర్కొన్న విషయం నిజం కాదా అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ న్యాయవాదులు, తాము ఏదైతే వెకేట్ చేయాలని పితీషన్ వేసామో, ఆ పిటీషన్ ను ఉపసంహరించుకుంటున్నామని అని నాయయముర్తి ముందు చెప్పారు. పిటీషన్ ను ఉపసమహరించుకుంటునట్టు కూడా అయన అక్కడే ప్రకటించారు. దీంతో కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. దీంతో హైకోర్టు చేతిలో మరోసారి మొట్టికయాలు తినకుండా, ప్రభుత్వం తప్పించుకుంది అనే చెప్పాలి.