డీజీపీ సవాంగ్ గారికి, ఇతర పోలీస్ అధికారులకు పోలీస్ శాఖలోని ఖాళీల భర్తీకి సంబంధించి, కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని, తాను లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైనే ఉందని, తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిగానే తాను తన సందేహాలను పోలీస్ శాఖ ముందుంచుతున్నాను తప్ప, పోలీస్ శాఖనుంచి రిటైరైన ఉద్యోగిగా కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా కంటే, ఒక రాజకీయ నాయకుడిగా,మంత్రిగా, లేక ప్రభుత్వ సలహాదారు మాట్లాడినట్టుగా సవాంగ్ నిన్న మాట్లాడారు. రెండేళ్లలో ఈ ప్రభుత్వం బ్రహ్మండంగా పనిచేసిందని, సీఎంకు కీర్తి కిరీటం డీజీపీగా ఉన్న వ్యక్తి ఇవ్వవచ్చా? పోలీస్ మాన్యువల్ ప్రకారం, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన వ్యక్తి, డీజీ స్థానంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ తప్పటడుగులు వేస్తున్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం, ఈ రెండు సంవత్సరాల కాలవ్యవధిలో ఉత్తమ పని తీరు కనబరిచిందని డీజీపీగా ఉన్న వ్యక్తి చెప్పడమేంటి? లక్షా84వేల264 రెగ్యులర్ ఉద్యోగాలు, 19,701 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ద్వారా 3లక్షల99వేల791ఉద్యోగాలు, డీఎస్సీ ద్వారా 2,193 ఉద్యో గాలు కలిపి, మొత్తం 6లక్షల05వేల949 ఉద్యోగాలు ఇచ్చారని సవాంగ్ చెప్పడం విడ్డూరంగా ఉంది. అదలా ఉంటే రికార్డులను పరిశీలిస్తే, గతప్రభుత్వం 5సంవత్సరాల్లో కేవలం 34,563 ఖాళీలను మాత్రమే భర్తీచేసిందని చెప్పడానికి డీజీపీ ఎవరు? ఆయన పెత్తనం ఇదేనా? అదేనా ఆయన విధినిర్వహణ? సవాంగ్ డీజీపీనా...లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డా...లేక అజయ్ కల్లం రెడ్డా...? లేక అంబటి రాంబాబా? అసలు ఈ మాటలన్నీ డీజీపీ కెందుకు? భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచీ, ఏ డీజీపీ కూడా, ఇలా గత ప్రభుత్వాన్ని తప్పు పడుతూ మాట్లాడిన దాఖాలాలు లేవు. సంబంధం లేకుండా మాట్లాడి, సీనియర్ పోలీస్ అధికారి, డీజీపీగా ఉన్న వ్యక్తి తన హోదాను తానే కించపరుచుకున్నాడు. ప్రభుత్వాన్ని అభినందించే పని డీజీపీకి ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా? రేపు ప్రభుత్వం తప్పుచేస్తే, ఈ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోరుగా? ఎందు కంటే ఆయన ఈప్రభుత్వానికి, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా మారిపోయారు.

డీజీపీ తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. గతప్రభుత్వంలో ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో.. ఈప్రభుత్వం వచ్చాక ఎన్ని రిక్రూట్ మెంట్స్ జరిగాయో బహిరంగంగా చర్చించడానికి డీజీపీ వస్తారా. ఆయనతో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. 15వేలమంది మహిళా పోలీసులు కొత్తగా పోలీస్ శాఖలో చేరారని, ఈ విషయం అందరూ గుర్తించాలని కూడా డీజీపీ చెప్పారు. 15 వేల మంది మహిళలను ఏ ప్రాతిపదిక ప్రకారం పోలీస్ శాఖలోకి చేర్చుకున్నారో డీజీపీ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అనేది ఉంది...దానికొక అడిషనల్ డైరెక్టర్ జనరల్ అధికారి బాధ్యులుగా ఉన్నారు. ఆ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ మహిళా పోలీసులను నియమించిందా? కొత్తగా పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లను నియమించాలన్న బోర్డు నిబంధనల ప్రకారమే జరగాలి. 15వేలమంది మహిళా పోలీసులు పోలీస్ శాఖలో చేరారని డీజీపీచెప్పారు. వారిని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమించిందా...లేక వైఎస్సార్ పార్టీ నియమించిందా? ఏ అర్హతలప్రకారం వారిని నియమించారు? డీజీపీ సవాంగ్ తనవ్యాఖ్యలువెనక్కు తీసుకోకుంటే, చట్టప్రకారం కోర్టులను ఆశ్రయించే ఆయనపై చర్యలకు ఉపక్రమిస్తాం. అక్కడే తేల్చుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నాం. డీజీపీ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తప్పయిందని చెబితే ఓకే, లేకపోతే, కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పాటు, న్యాయ స్థానాలను ఆశ్రయించడం తథ్యం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read