ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డికి కొద్ది సేపటి క్రితం గుండెపోటు రావటంతో చనిపోయారు. ఆయనకు ఉదయం గుండెపోటు రావటంతో, హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారాని వార్తలు వచ్చాయి. అయితే ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు, ఆయన పల్స్ అందక పోవటంతో, వైద్యులు తీవ్ర కృషి చేస్తున్నారని, అత్యవసర చికిత్స అందిస్తున్నారని వార్తలు వచ్చాయి. పరిస్థితి మాత్రం విషమంగా ఉందని, వార్తలు వస్తూ ఉండగానే, ఆయన చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయన నిన్నే దుబాయ్ లో జరిగిన పారిశ్రామిక సదస్సుకు వెళ్లి వచ్చారు. ఈ రోజు ఉదయం ఆయనకు గుండె పోటు రావటంతో, ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తుంది. పరిస్థితి అయితే విషమంగా ఉందని, అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పిన కొద్ది సేపటికే, ఆయన చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. కేవలం 50 ఏళ్ళ వయసుకే ఆయన చనిపోయారు.
విషాదకరం... ఏపి మంత్రి గౌతమ్‌రెడ్డి కన్నుమూత..
Advertisements