నిలకడ లేని తనంతో, నోటికి ఏది వస్తే అదే మాట్లాడే పవన్ కళ్యాణ్, ఇప్పటికే ట్విట్టర్ లో చేసిన రచ్చకు, రెండు న్యూస్ చానల్స్ లీగల్ నోటీసులు పంపించాయి. అవి ఏమైనయ్యో తెలియదు, వాటితో రాజీ కుదురుచుకున్నారు అనే టాక్ నడుస్తుంది.. ఇది సెటిల్ అవుతుంది అనుకుంటున్న టైంలో, పవన్ నోటి దూలకు, మరో లీగల్ నోటీసు వచ్చింది... సర్దార్ గౌతు లచ్చన్న... ఈయన గురించి తెలియని వారు ఉండరు... ఎంతో మందికి ఆదర్శం ఆయన... ఆయన వారసుడిగా, గౌతు శివాజీ ఉన్నారు.. ఆయన గత ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు... ఎంతో నిజాయితీ పరుడుగి పేరు ఉన్న గౌతు శివాజీ అంటే, శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గౌరవం ఉంది. ఇలాంటి వ్యక్తిని, ఎవరో రాసి ఇచ్చిన స్ర్కిప్ట్ చూసి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసారు...
దీని పై నొచ్చుకున్న గౌతు శివాజీ నిన్న స్పందించారు. తాను సర్దార్ గౌతు లచ్చ న్న కుమారుడినని, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను, తన కుటుంబం ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఎమ్మెల్యే గౌతు శివాజీ అన్నారు. ఎవరో ఇచ్చిన స్ర్కిప్ట్ చదివి, నేను అవినీతి పరుడుని అని, నా కుటుంబం అవినీతి కుటుంబం అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మా కుటుంబ వ్యక్తి పై ఆరోపణలు చేయడం తగదన్నారు. అవినీతి ఆరోపణలు చేసిన పవన్‌కు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించామని చెబుతూ వాటి ప్రతులను విలేకరులకు అందించారు. నియోజకవర్గం లో తానంటే ఏమిటో అందరికీ తెలుసని, జిల్లా లో సీనియర్ ఎమ్మెల్యేగా జిల్లాలో ఏ కార్య క్రమంలోనైనా ముక్కు సూటిగా మాట్లాడుతూ స్వపక్షంలో విపక్ష నేతగా గుర్తింపు పొందానన్నారు.
కిడ్నీ వ్యాధులపై స్పందించడం లేదని నినదించడం తగదని, విశాఖపట్నానికే పరిమితమైన డయాలసిస్ కేంద్రాలను పలాస, సోంపేటకు తీసుకువచ్చామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు కట్టుబడి నిలబడి నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలన్నారు. బహిరంగంగా అన్ని మాటలు మాట్లాడారు, మీరు చెప్పిన వాటి పై ఒక్క ఆధారమన్నా చూపండి, ఎవరో చెప్పారో అందుకే చెప్పాను అంటే, మీ గురించి కూడా అందరూ చాలా చెప్తున్నారు, మేము కూడా అవి చెప్పమంటారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు... రాజకీయాలు హుందాగా ఉండాలని, మీరు ఇక్కడే కొన్ని రోజులు ఉంటున్నారు కాబట్టి, ఈ చౌకబారు మాటలు కాకుండా, ఆధారాలతో మాట్లాడాలని చాలెంజ్ చేసారు.