శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజల జీవన స్థితిగతులను ఉన్నతంగా మార్చేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుత నేతలకు స్పూర్తిగా నిలుస్తారు...రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి ఉదయం 3.30 గంటలకే ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరుకావడం యువనేతలకు సైతం ఆశ్చర్య చకితులను చేసింది... ఆదివారం తెల్లవారు జామున ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి శంకుస్థాపన చేయడం విశేషం...ప్రజా సేవలో అలుపెరగని తత్త్వం, నిరంతర ప్రజా శేయస్సును కాంక్షించడం ఆయన నైజంగా మారింది... అటు ప్రభుత్వ, ఇటు పార్టీ సమావేశాల్లోనూ ప్రజలకు ఏ మాత్రం మెరుగైన సేవలు అందించగలం, ప్రజల స్థితిగతుల్లో మేలు చేసే పనులకు సమయాన్ని కేటాయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి లేరనడం నిజం...
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో ఫిర్యాదుల స్వీకరణ విభాగాన్ని ఏర్పాటుచేశారు. దీనిని సీఎం చంద్రబాబు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఉండవల్లి సమీపంలో ముఖ్యమంత్రి నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలును కూడా ప్రారంభించారు. ఈ విభాగం ఏర్పాటుతో ఇకపై సచివాలయంతో పాటు ఇంటి వద్ద కూడా ఫిర్యాదులను ముఖ్యమంత్రి స్వీకరించనున్నారు. అలాగే ప్రతి ఫిర్యాదును కూడా ఆన్లైన్లో అధికారులు నమోదు చేయనున్నారు. అనంతరం ఫిర్యాదు పరిష్కారం వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదుదారునికి అధికారులు తెలపనున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తెదేపా కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం తెల్లవారుజామున శంకుస్థాపన చేశారు. ఉదయం 5.17 నిమిషాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు రమణ, కేంద్ర మంత్రులు, ఏపీ మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. 2018 డిసెంబరు నాటికి భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెదేపా కేంద్ర కార్యాలయం కోసం 3.60 ఎకరాల విస్తీర్ణంలో 3 భవనాలు నిర్మిస్తున్నారు. పరిపాలనా భవనం జీ+4 అంతస్తులతో నిర్మిస్తారు. ఐదో అంతస్తులో పార్టీ జాతీయఅధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలుంటాయి.