ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, కేంద్రం నుంచి ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తున్నారు అంటే, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రూపాయి ఇవ్వకపోయినా, కేంద్ర బడ్జెట్ అద్భుతం అంటూ లేఖలు రాస్తారు. రైల్వే జోన్, పోర్ట్, స్టీల్ ఫ్యాక్టరీ, ఇలా విభజన హామీలు గురించి మాట్లాడమంటే మాట్లాడరు. పోలవరం డబ్బులు ఇవ్వమని అడగరు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం అంటే మెతకగా ఉంటారు. రాత్రి పూట వెళ్లి అమిత్ షా ని కలుస్తారు. మోడీ గారు కనిపిస్తే, కాళ్ళ మీద వంగిపోవటానికి ప్రయత్నం చేసారు. జగన్ మోహన్ రెడ్డి, ఒక పక్క ఇంత వినయంగా ఉంటూ, మోడీ, అమిత్ షా దృష్టిలో మంచిగా ఉండటానికి సర్వ ప్రయత్నాలు చేస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం, ఏపి జనాల ముందు ఎలివేషన్లు ఇస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి, పోస్కో తో కలిపి, ఈ డీల్ సెట్ చేసారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత గమనించిన వైసీపీ నేతలు, తాము కూడా పోరాటం చేస్తామని ముందుకు వచ్చారు. అంతటితో అపారా అంటే, ప్రజలను చుసిన ఉత్సాహంలో, ఏకంగా ప్రధాని మోడీకి వార్నింగ్ లు ఇస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు.
విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మల్యే గుడివాడ అమర్నాథ్, మోడీని ఉద్దేశించి, ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్న వారి దగ్గరకు వెళ్ళిన గుడివాడ అమర్నాథ్, మా జగన్ మోహన్ రెడ్డి 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీనే మట్టికరిపించారని, మాకు మోడీ పెద్ద లెక్క కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. మోడీని కూడా మట్టికరిపిస్తాం అనే విధంగా వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి చేసే పోరాటం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అంటూ, బీజేపీకే వార్నింగ్ ఇస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఇది ఏదో ఉత్సాహ పరుస్తునికి చేసినా వ్యాఖ్యలా, నిజంగానే ఇలా అన్నారో కానీ, ఎలా అన్నా సరే, ఈ మాటలు ఢిల్లీ వాళ్లకి తెలిస్తే, వాళ్ళు ఎలా మట్టికరిపిస్తారో, పాపం గుడివాడ అమర్నాథ్ గారికి తెలుసో తెలియదో అని, విశ్లేషకులు వాపోతున్నారు. అయతే యధావిధగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాత్రం, ఈ విషయంలో కూడా సైలెంట్ గా ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీ నేతలు ఏ చిన్న వ్యాఖ్యలు చేసిన పడిపోయే ఏపి బీజేపీ నేతలు సోము, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. మరి రేపు అయినా నోరు విప్పుతారో లేదో చూడాలి.