గుడివాడలో నిర్వహించిన కాసినో వివరాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాని వెనకాల ఎవరున్నారు ,ఏంటి ,నిర్వాహుకులు ఎవరున్నారు అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే దీనికి ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్ గోవా కేద్రంగా అక్కడ BIG daddy అనే కాసినో నిర్వహిస్తూ ఉంటాడని, ఇప్పుడు ఈయనే గుడివాడలో మొత్తం కుడా నిర్వహించినట్లు నిన్న తెలుగుదేశం పార్టీ ఆధారాలు బయట పెట్టింది. అయితే పోలీసులు మాత్రం దేనిని స్పష్టం చేయడం లేదు. దీని వెనుక చీకోటి ప్రవీణ్ ఉన్నడా, ఇంకా ఎవరు ఉన్నారు, అసలు ఈ చీకోటి ప్రవీణ్ ఎవరి అండదండలతో వచ్చాడు అనే అంశం పై కూడా పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు చీకోటి ప్రవీణ్, MLA వల్లభనేని వంశీ, కలిసున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. వీటన్నిటికి ప్రధాన కారకుడు ప్రవీణ్ ఎవరి ప్రోద్బలంతో ఇక్కడకు వచ్చి, ఇవన్నీ ఏర్పాటు చేసారు అని కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ప్రవీణ్ పూర్వ చరిత్ర కనిక చూస్తే గతం లో 2017 దీపావళి సమయంలో హైదరాబాద్ హోటల్ మారియట్ లో ఇటువంటి కాసినోనే నిర్వహించి పోలీసులకు చిక్కాడు. ఈ కోణంలో చూస్తే ఆయనే ఖచ్చితంగా ఇక్కడ కూడా పెట్టుంటాడు అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ చీకోటి ప్రవీణే ఆంద్రాలోనే కాకుండా అన్ని చోట్లా కూడా ఎక్కువగా కాసినోలు పెడతాడని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారని తెలుస్తుంది.
ఆయన్ని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాసం ఉందని చెబుతున్నారు. అసలు చీకోటి ప్రవీణ్ ను తీసుకొచ్చింది ఎవరు, ప్రవీణ్ వెనకాల ఏ పొలిటికల్ లీడర్స్ హస్తం ఉంది అనే కోణంలో కూడ మొత్తం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ చీకోటి ప్రవీణ్ కు , కొడాలి నాని, వల్లభనేని వంశీ కి అయితే చాలా పరిచయాలు ఉన్నాయని మాత్రం చాలా మంది చెబుతున్నారు. వీరి మద్య చాలా రోజుల నుంచి స్నేహం ఉందని కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంభందించి న వాస్తవాలు అయితే మాత్రం పోలీసులు వెలుగులోకి తీయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాపోతున్నారు. పోలీసులు మాత్రం ఈ రోజు నుంచి విచారణ అయితే ప్రారంభిస్తాం అని మాత్రం చెపుతున్నారు. నూజివీడు DSP బి. శ్రీనివాసరావు నేతృత్వం లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు నిజాలను వెలుగు తీసి దీనికి కారకులైన వారిని పోలీసులు తెరముందుకు తీసుకువస్తారా, అనేది వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించిన వాస్తవాలన్ని బయట పెట్టాల్సింది మాత్రం పోలీసులే.
ఆ విచారణలో దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ప్రదానంగా మంత్రి కొడాలి నాని హస్తం ఉందా, లేక పోతే వల్లభనేని వంశీ సహకారంతోనే,కొడాలి నాని మొత్తం కూడా దీనిని ఏర్పాటు చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ వారి ఎవ్వరికీ తెలియదు, కేవలం ఆయన ఉన్నత వర్గాలతో లేదా పొలిటికల్ లీడర్స్ తో మాత్రమే సంబంధాలు పెట్టుకుంటారు. అయితే 2017 దీపావళి సమయంలో హైదరాబాద్ హోటల్ మారియట్ లో నిర్వహించినప్పుడు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే అంశం పై డేటా సేకరిస్తే కూడ ఈ విషయం పై మరింత క్లారిటీ వచ్చే అవకాసం ఉందని చెపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరితో ఈయనకు సంబంధాలు ఉన్నయా అని చూస్తే మాత్రం వంశీతో చాలా దగ్గర సంబందాలు ఉన్నాయని చెపుతున్నారు. వీళ్ళ ఫోటోలు చూస్తే మాత్రం కొంత మంది వైసిపి నేతల హస్తం తోనే ఇందంతా జరిగినట్లు తెలుస్తుంది. అందులోని కాసినో నిర్వహించిన k కన్వెన్షన్ హాల్ మంత్రి కొడాలి నాని కి సంబంధించింది. ఇంతపెద్ద ఎత్తులో నిర్వహించారంటే వాళ్ళ హస్తం లేకుండానే జరిగిందా అని కూడా విమర్శిస్తున్నారు.