ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పేకాట పాపాలు బయట పడ్డాయి. ఓపెన్ సీక్రెట్ గా , గత కొన్ని నెలలుగా ఇక్కడ కోట్ల రూపాయల పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక ప్రముఖ అధికార పార్టీ నేత, ఈ దందా నడిపిస్తున్నాడని, అందరికీ తెలిసిందే. అనేక సార్లు ప్రతిపక్షాలు కూడా ఈ విషయం ఎత్తి చూపాయి. అయితే అప్పట్లో ప్రతిపక్షాలు మాట్లాడితే ఎదురు దారి చేసేవారు. అయితే ఇప్పుడు ఎందుకో కానీ, పోలీసులు ఒకేసారి మెరుపు దా-డు-లు చేసారు. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, లోకల్ పోలీసులకు సమాచారం లేకుండా, ఎస్ఈబీ పోలీసులు ఈ దాడులు చేయటం గమనార్హం. కృష్ణా జిల్లా, గుడివాడ నియోజికవర్గం, నందివాడ మండలం, తమిరశలో నిన్న రాతి ఒక అతి పెద్ద పేకాట శిబిరం పై మెరుపు దాడి చేసారు. అయితే ఈ దాడులకు లోకల్ పోలీసులు కాకుండా, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా, మెరుపు దా-డి చేయటం గమనార్హం. ప్రత్యెక అధికారి జిందాల్ ఈ రైడ్ లో స్వయంగా పాల్గున్నారు. దాదాపుగా 40 మంది స్టాఫ్ తో వచ్చారు. నందివాడ మండలంలో చంద్రయ్య కాలువ గట్టు, చేపల చేరువులు మాటున ఆడుతున్నట్టు పక్కా సమాచారంతో, చుట్టు ముట్టారు. అయితే అక్కడ సీన్ చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు.
పెద్ద ఎత్తున ప్రముఖులు అక్కడ ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 42 లక్షల క్యాష్ పట్టుకున్నారు. 30 పైగా కార్లు పట్టుకున్నారు. అయితే ఒక మంత్రి అనుచురులు ఈ శిబిరం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇక్కడ పోలీసులు షాక్ అయిన మరో విశేషం ఏమిటి అంటే, పెద్ద ఎత్తున కాయిన్స్/టోకెన్స్ దొరికాయి. 42 లక్షలే ఎక్కువ అనుకుంటే, ఆ టోకెన్స్ చూసి షాక్ అయ్యారు. గుడివాడలోనే డబ్బులు తీసుకుని, డబ్బుల బదులు, టోకెన్స్ ఇచ్చి, నిర్వాహకులు ఇక్కడకు తీసుకుని వస్తున్నారని తెలుసుకున్నారు. ఆ టోకెన్స్ ఖరీధు చెప్పటం లేదు కానీ, మొత్తంగా ఒక 10 కోట్ల పైనే ఉంటుందని అనధికార సమాచారం. ఈ మొత్తం పెకటా శిబిరం ఇంత పక్కాగా, నిర్వహించటం చూసి, పోలీసులే షాక్ అయ్యారు. అందుకే పై నుంచి ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ముందుగా మీడియాకు లీక్ చేసారు. దీంతో ఈ విషయం రచ్చ రచ్చ అయ్యింది. అయితే ఇందులో ప్రముఖులను, ప్రముఖ నాయకుడి పాత్రను తప్పించే పని అయితే జరుగుతుందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాత్రి పిచ్చ పాటీగా మీడియాతో చెప్పటమే కానీ, ఇప్పటి వరకు పోలీసులు కూడా పక్కా సమాచారం చెప్పలేదు. చూద్దాం, ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.