గుంటూరు నగరంలో ఇవాళ పెను ప్రమాదం తప్పింది. పాత గుంటూరులోని మణి హోటల్‌ సెంటర్‌లో శనివారం మధ్యాహ్నం ఒక్క సారిగా మూడంతస్థుల భవనం కుప్పకూంది. అయితే ఈ భవనంలో ఎవరూ లేకపోవటంతో, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు, కాని ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది... భవనం కూలిన సమయంలో మిగతా ఆస్థులుకు కూడా ఏమి నష్టం జరగలేదు, అలాగే ప్రాణ నష్టం కూడా ఏమి జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

guntur 12112017 2

కృష్ణా పుష్కరాల సమయంలో గుంటూరు నగరంలోని ముఖ్యమైన రోడ్లను విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. అయితే సమయం దాటిపోవడంతో అధికారులు ఆ పనులను నిలిపివేశారు. అలా నిలిపేసిన పనులను తాజాగా మళ్లీ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నందివెలుగు రోడ్డులోని మణి హోటల్ సెంటర్‌లో రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న పసుపులేటి నరసింహారావుకు చెందిన భవంతిని 60 శాతం మేర కూల్చేశారు.

guntur 12112017 3

దీనికి సంబందించి ఇంటి యజమానులకు నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు అందుకున్న ఇంటి యజమానులు ఆ ఇంటిని ముందుగానే ఖాళీ చేశారు. అయితే, ఈ తవ్వకాల్లో భవంతి పునాది దెబ్బతింటంతో, శనివారం మధ్యాహ్నం పునాది కుంగిపోవటంతో భవంతి ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడ మరమ్మతులు చేసేందుకు వచ్చిన కార్మికులు బయటికి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read