వాళ్ళు సిబిఐ అధికారులు. గుంటూరులో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఎంక్వయిరీ చేస్తున్నారు. వారికి రక్షణగా ఉండే ఒక పోలీస్ , సిబిఐ పైనే నిఘా పెట్టారు. సిబిఐ అధికారుల సమాచారాన్ని ఎవరికో చేరవేస్తున్నారు. ఈ విషయం సిబిఐ ఆఫీసర్లు పసిగట్టారు. వెంటనే ఆమెను పంపించి వేసి, గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఘటన, నిన్న జరిగినట్టు ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం సంచలనంగా మారింది. ఇక పూర్తి విషయానికి వస్తే, గుంటూరులో ముగ్గురు పోలీస్ అధికారులు అక్రంగా నిర్బందించారు అంటూ, ఒక కేసు హైకోర్టులోకి వెళ్ళటం, హైకోర్టు ఆదేశాల ప్రకారం, సిబిఐ ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే. క్రికెట్ బెట్టింగ్ విషయంలో, ఈ అంశం జరిగింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం, సిబిఐ రంగంలోకి దిగింది. గుంటూరుకి వచ్చి ఎంక్వయిరీ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గుంటూరు పరిధిలోని ఒక స్టేషన్ లో మహిళా ఎస్ఐగా పని చేస్తున్న ఒక వ్యక్తిని, సిబిఐ అధికారులకు బద్రత నిమిత్తం నియమించారు. విచారణలో భాగంగా సిబిఐ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణకు వెళ్ళగా, వారికి బద్రతగా వెళ్ళిన ఆ ఎస్ఐ, సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్న తీరుని తన సెల్ ఫోన్ తో ఫోటోలు, వీడియోలు తీసినట్టు, సిబిఐ అధికారులు పసిగట్టారు. వెంటనే ఆమే ఫోన్ లాక్కుని చూడగా, తమ విచారణ పై నిఘా పెట్టారని అర్ధం చేసుకున్నారు.
వెంటనే ఆ ఎస్ఐ ని అక్కడ నుంచి పంపించే వేసారు. అలాగే జరిగిన విషయం మొత్తాన్ని, తమ పై నిఘా పెట్టటాన్ని, సిబిఐ అధికారులు, గుంటూరు ఎప్సీకి ఫిర్యాదు చేసారు. అలాగే గుంటూరు ఐజికి కూడా ఫిర్యాదు చేసారని ఆ ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం సారాంశం. అంతే కాదు, జరిగిన విషయం మొత్తాన్ని సిబిఐ హెడ్ క్వార్టర్స్ కి కూడా చెప్పి, తమ పై నిఘా పెట్టిన వ్యక్తి పై కేసు పెట్టి, ఆమె ఎందుకు నిఘా పెట్టారో అనే విషయం పై కూడా, విచారణ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. 2019 అక్టోబర్ లో గుంటూరు సిసిఎస్ పోలీసులు ముగ్గురి పై అభియోగం హైకోర్టులో నమోదు అయ్యింది. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో కేసు వేయటం దీని పై, పోలీసులు మీదే ఆరోపణలు రావటంతో, హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, ఢిల్లీ బ్రాంచ్ ఎస్పీ ఎంఎస్ ఖాన్ గుంటూరు పోలీసుల పై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. Source : https://www.eenadu.net/districts/latestnews/Guntur/4/120099862