గుంటూరు ఘటనకు జగన్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల అనుమతితో ఉయ్యూరు ఫౌండేషన్ సభ ఏర్పాటు చేసిందని, వేలాది మంది జనం వచ్చే ప్రాంతంలో వంద మంది పోలీసులు కూడా లేరని ఆయన అన్నారు. తోపులాట సమయంలో పోలీసులు సరిగా స్పందించ లేదని, ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోందని, బ్లేమ్ గేమ్ కు వైసీపీ ప్రయత్నిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. గుంటూరు వస్త్రాల పంపిణీలో తోపులాటలో ముగ్గురు మృతి వెనుక భారీ కుట్రకోణం ఉందనే అనుమానాలు టిడిపి వ్యక్తం చేస్తుంది. టిడిపి అధినేత ఎక్కడికెళితే అక్కడ జనసంద్రమవుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సభలకు పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే వస్తున్న జనం బారికేడ్లు దూకి పారిపోతున్నారు. చంద్రబాబుపై దా-డికి నందిగామలో ప్రయత్నించారు. సీఎస్వోకి గాయమైంది. అయినా భద్రతా ఏర్పాట్లు మారలేదు. రాయలసీమలో చంద్రబాబు కాన్వాయ్‌కి అడ్డంగా వైసీపీ పేటీఎం బ్యాచ్ పడింది. అయినా పోలీసులు తీరుమారలేదు. కందుకూరు ఘటన డ్రోన్ షాట్ల కోసమంటూ వైఎస్ జగన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు గుంటూరు వికాస్ నగర్లో భారీ బహిరంగ ప్రదేశంలో ఎటువంటి తొక్కిసలాటకి ఆస్కారమే లేని చోట తోపులాట మెరుపువేగంతో ఎలా మొదలైంది? అని టిడిపి ప్రశ్నిస్తుంది. కందుకూరు ఘటన తరువాత పోలీసులు చంద్రబాబు సభకు అదనంగా తీసుకున్న భద్రతా చర్యలు లేకపోవడమే కారణం అని ఆరోపిస్తుంది. కందుకూరు ఘటనపై రెండు రోజుల తరువాత స్పందించారు సీఎం జగన్‌రెడ్డి. గుంటూరు ఘటన జరిగిన వెంటనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు క్షణాల్లో స్పందించారు.
ఘటనా స్థలానికి, జీజీహెచ్‌కి క్యూ కట్టేశారు. ఈ తొక్కిసలాట జరుగుతుందని వీరికి ముందే తెలుసా? అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసుకున్న కొత్త దుస్తులు, నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఇది. దీనికి చంద్రబాబుని ముఖ్యఅతిథిగా పిలిచారు. తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధంలేనిది ఈ కార్యక్రమం. దీనిని టిడిపి ముడిపెడుతూ వైసీపీ ఆరోపణలు చేయడం వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. చంద్రబాబు సాయంత్రం 5.10 గంటలకు వికాస్ నగర్ సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సువిశాలమైన స్థలంలో ఎటువంటి తోపులాట లేదు. 6.10 చంద్రబాబు తిరిగి వెళ్లారు. అప్పటివరకూ ఎటువంటి అలజడీ లేదు. 6.45కి ఈ ఘటన జరిగింది. అయితే బ్లూ మీడియా క్షణాల్లో చంద్రబాబు సభలో తొక్కిసలాట అంటూ స్క్రోలింగ్ వేశాయి. చంద్రబాబు వెళ్లిన దాదాపు 40 నిమిషాల తరువాత ఘటన జరిగినా..చంద్రబాబు ఉన్నప్పుడే అన్నట్టు స్క్రోలింగ్/బ్రేకింగ్ ఊదరగొట్టాయి.. తోపులాట 6.45కి జరిగితే...వైసీపీ సోషల్మీడియాలో సంఘటన బాధితుల బైట్లు క్షణాల్లో ఎలా ప్రత్యక్షమయ్యాయి అనేది కూడా టిడిపి అనుమానంగా ఉంది. వైసీపీ సోషల్మీడియా మొత్తం గుంటూరులో ముగ్గురు మహిళల మృతి చెందిన నిమిషాల్లో యూనిఫాంగా ఒకే కంటెంట్ షేర్ చేస్తోంది.. అంటే వైసీపీలో అన్ని విభాగాలకు గుంటూరులో తోపులాట జరగుతుందని ముందే తెలుసు అని టిడిపి ప్రశ్నిస్తుంది.