తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, ఎమ్మల్సీ నారా లోకేష్, జగన్ పార్టీ చేస్తున్న మారణ హోమం పై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై, వైసీపీ పార్టీ నేతలు జరుపుతున్న దాడులు, దౌర్జన్యాల పై స్పందిస్తూ, తెలుగుదేశం పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి అని, అంతే కాని అరాచకాలకు మార్గం కాకూడదని లోకేష్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ 20 రోజుల్లోనే, తెలుగుదేశం కార్యకర్తల పై రాష్ట్ర వ్యాప్తంగా, వందకు పైగా దాడులు జరిగాయని లోకేష్ అన్నారు. ఇలా దాడులు చేసి, చంపేయటమే రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. నిన్న జరిగిన ఒక సంఘటన చెప్తూ, గుంటూరు జిల్లా మాచవరం మండలం, పిన్నెల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారని, అక్కడి రైతులను ఐదేళ్ల పాటు గ్రామ బహిష్కరణ చేశారని లోకేష్ ఆరోపించారు.

ఇదే విధంగా నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదలు నివిసించే గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని అన్నారు. ఈ మేరకు ఆయన పత్రికల్లో వచ్చిన వార్తలు అటాచ్ చేశారు. పోలీసు యంత్రాంగం, ఈ దాడులు పై వెంటనే స్పందించి, ఇప్పటి నుంచి అయినా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని లోకేష్ కోరారు. రెండు రోజుల క్రితం జరిగిన వర్క్ షాప్ లో, టీడీపీ ఓడిన 3 వారాల్లోనే 100 చోట్ల దాడులు జరిగాయని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఈ విషయం పై స్పందించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కార్యకర్తల పై దాడులు జరుగుతున్నాయని, వారి ఆస్తులు కూడా ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచినా, ఇలా ప్రత్యర్ధుల పై ఎప్పుడూ దాడులు చేయలేదని చంద్రబాబు చెప్పారు. గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలకు, అక్కడి నేతలు అండగా ఉండాలని చంద్రబాబు కోరారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read