రాజధాని అమరావతిలో గత కొన్ని రోజులుగా, వారం పది రోజులుగా, రాజధనిలో ఉన్న మెటీరియల్ తవ్వుకుని పోతున్నారు. రాజధానిలో రోడ్డు తవ్వి, ఇసుక, కంకర తవ్వేసి, తీసుకువెళ్ళి, అక్రమ దారులు రెచ్చిపోతున్నారు. నెల రోజుల క్రితం దొండపాడు, అనంతవరం గ్రామాల మధ్య ఉన్న రోడ్డును తవ్వుకుని వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది. అయితే అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో, అక్రమార్కులు రెచ్చిపోయారు. తాజాగా ఉద్దండరాయినిపాలెంలో మరో రహదారిని జేసీబీతో తవ్వుకుని, లారీలతో ఎత్తుకుని పోయారు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్డులు తవ్వి ఎత్తుకుపోతున్న వీడియోలు పోస్ట్ చేసారు. అయితే దీని పై అనూహ్యంగా గుంటూరు పోలీసులకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్ స్పందించింది. అయితే ఆ ట్వీట్ కు సోషల్ మీడియా నుంచి విమర్శలు వచ్చి పడ్డాయి. ఎప్పుడూ లేనంతగా, పోలీసుల తీరు పై సోషల్ మీడియాలో ఎదురు దాడి జరిగింది. ఇంత జరిగినా పోలీసులు ఆ ట్వీట్ తీసి వేయటం కానీ, వివరణ కాని ఇవ్వలేదు. దీంతో పోలీసులు తీరు పై విమర్శలు వెల్లువ వచ్చింది. రాత్రి పూట జేసిబీలతో అమరావతి రోడ్డులు తవ్వేస్తున్నారు అంటూ, ఒక యువతి వీడియో పోస్ట్ చేసింది.

guntur 28072021 21

దానికి వివరణ ఇచ్చిన గుంటూరు పోలీసులు, మీరు వాస్తవాలు తెలుసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి అని చెప్తూ, అక్కడ అక్రమార్కులు ఎవరూ వచ్చి తవ్వలేదని, ఆ గ్రామస్తులే, ఇటీవల కురిసిన వర్షానికి తమ ఊరిలో రోడ్డు బాగోక పొతే, అమరావతిలో ఉన్న రోడ్డు తవ్వుకుని, ఆ కంకరతో తమ రోడ్డు బాగు చేసుకున్నారని చెప్పారు. అయితే పోలీసులు సమాధానంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. రోడ్డు బాగోక పొతే ప్రభుత్వంతో చెప్పి కొత్త రోడ్డు వేసుకోవాలి కానీ, బాగున్న అమరావతి రోడ్డు తవ్వేసి వేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ఇలాగే ఎవరికైనా ఇబ్బంది వస్తే, పక్క ఇంట్లో నుంచి తెచ్చుకోవచ్చా అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసులే ఇలా లైసెన్స్ ఇస్తే, అక్రమ దారులు ఎలా రెచ్చిపోతారా తెలియదా అని వాపోయారు. అయితే అందరూ అనుకున్నట్టే నిన్న హైకోర్టు దగ్గర, ప్రభుత్వం వేసిన ఇసుక డంప్ ను కూడా, కొంత మంది తవ్వుకుని వెళ్ళిపోయారు. అయితే దీని పై ఇంకా పోలీసులు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మొత్తానికి, అమరావతిలో ఇలాంటి వింతవింతలు ఎన్నో జరుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read