గుంటూరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మల్యే ముస్తఫాకు చెందిన ఒక గోడౌన్ లో ఈ రోజు, గుంటూరు అర్బన్ పోలీసులు పెద్ద ఎత్తున, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని మండలం కొప్పురావూరు సమీపంలో ఉన్న ఎమ్మెల్యే ముస్తఫా గోడౌన్ లో అక్రమంగా, తయారు చేస్తున్న గుట్కా ప్యాకిట్ల తయారీ జరుగుతున్నట్టు, పోలీసులు గుర్తించారు. అయితే ఈ రోజు ఉదయం, ఎస్పీ అమ్మిరెడ్డికి నేరుగా సమాచారం రావటంతో, ఆయనే స్వయంగా రంగంలోకి దిగి, ఒక బృందాన్ని తీసుకుని, అక్కడ తనిఖీ చెయ్యగా, గోడౌన్లో గుట్కా తాయారు చేస్తున్నట్టు కనుగొన్నారు. టెంపర్ అనే పురతో ఈ గుట్కా తయారు చేస్తున్నట్టు గుర్తించారు. అక్కడ కోటి రూపాయలు విలువ చేసే, గుట్కాని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
అయితే ఇక్కడ, పాన్ మసాలా తయారు చెయ్యటం కోసం, సుధాకార్ రెడ్డి అనే పేరుతో అక్కడ అనుమతి తీసుకుని, ఈ గోడౌన్ లో తయారు చేస్తున్నట్టు చెప్తూ, టెంపర్ అనే పేరుతో గుట్కాను తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ నుంచి కోట్లాది రూపాయల గుట్కాని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీంట్లో ఆసక్తికర అంశం ఏమిటి అంటే, కోవిడ్ లో ఇచ్చే నిత్యావసర పాసులు ఇచ్చీ మరీ, ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్టు గుర్తించారు. ఇది తెలిసిన ఎస్పీ అమ్మిరెడ్డి విస్తు పోయారు. అక్కడ సామాను, సరుకు అంతా సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా చెయ్యటం, ఏకంగా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి, ఈ రాకట్ పట్టుకోవటం, కొసమెరుపు.