తెలుగుదేశం పార్టీ వారికి ఇదేమిటో కాని, అధికారంలో ఉన్నా కూడా, ప్రతిపక్షం లాగానే ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు విమర్శలు చేస్తారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు దాడులు చేసి చంపేస్తారు. పక్కనున్న కెసిఆర్ ని చూసి, మా చంద్రబాబు మరీ ఇంత మెతక వైఖరి ఏంటో అని కార్యకర్తలు బాధ పడుతూ ఉంటారు. రాజశేఖర్ రెడ్డి అన్ని హత్యలు చేపిస్తే, ఈయన సియం అయిన తరువాత శాంతి శాంతి అంటారని, బాధపడుతూ ఉంటారు. కాని చంద్రబాబు మాత్రం, ఎక్కడా బ్యాలన్స్ తప్పరు. ఇది పార్టీకి, కార్యకర్తలకి ఇబ్బంది అయినా సరే.. ఇదే అలుసుగా తీసుకుని, అవతల వైసిపీ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.
గుంటూరు జిల్లాలోని వినుకొండ పసుపులేరు బ్రిడ్జి దగ్గర ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీ కొన్నది.! ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంకు చెందిన గురజాల సోమయ్య (30), వెంకటకృష్ణ (26), మల్లయ్య (28) అని తేలింది. అయితే ఈ ప్రమాదం పై దర్యాప్తు చేయిగా, షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. సమాచారం అందుకున్న డీఎస్పీ నాగేశ్వరరావు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన కారణం ఏంటి అంటే, ఎ.కొత్తపాలెంలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణాన్ని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ వర్గీయులు బైక్‌లపై బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ వర్గీయులు మార్గమధ్యలో బైక్‌ను కారుతో ఢీకొట్టారు. అయితే ఆ బైక్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే కన్నుమూశారు.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అభయమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో బైక్ పై వెళుతున్న ముగ్గురిని ఒకపక్క కారు..మరోప్రక్క లారితో ఢీ కొట్టి చంపేశారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పరిస్థితి ఉదృతంగా వుంది.. పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసిపీ నేతలు అధికారంలో లేకపోతేనే ఇంత రచ్చ చేస్తున్నారు అంటే, ఇక అధికారం ఉంటే వీరి చేష్టలు ఊహకు కూడా అందవు...