రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ఒక పధకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయనిముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. నిన్న పార్టీ సభ్యులతో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు. గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తుంటే, అతి పెద్ద కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ‘కొద్ది రోజుల క్రితం గుంటూరులో పనిగట్టుకుని విధ్వంసం సృష్టించారు. ఒక చిన్నారిపై జరిగిన అఘాయత్యాన్ని అడ్డం పెట్టుకొని విధ్వంసానికి ప్రణాళిక రచించారు. అంతకు ముందు తిరుపతిలో కూడా అటువంటి ప్రయత్నమే జరిగింది. ఆ తర్వాత తిరుమల పవిత్ర క్షేత్రంపై రమణ దీక్షితులు ద్వారా బురద చల్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి మరో పది కుట్రలకు పథక రచన చేస్తున్నారు" అని చంద్రబాబు అన్నారు.

cbn 19052018 2

'రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చిత్రించడం ద్వారా మన ప్రభుత్వాన్ని ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కుట్రలతో ప్రభుత్వంపైనా, టీడీపీపైనా చెడు అభిప్రాయం కలిగించి మనం చేసిన మంచి పనులపై నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని అనుకుంటున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి’ అని పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారు. గుంటూరు విధ్వంసం పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారని తెలిపారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. 3000 మంది జనం, 87 వాహనాలు రాత్రికి రాత్రి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.

cbn 19052018 3

మూడు రోజుల కిందట బాలాజీనగర్‌కు చెందిన చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అత్యాచారయత్నం చేయబోగా అది పాతగుంటూరు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆ ఘటన అంతగా మారటానికి ముగ్గురు నేతలు ఉన్నారని, అందువల్లే ఆ రోజున పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్‌ ముందు దాని పరిసరాల్లో అల్లర్లు జరిగాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు ఈ అల్లరకు ఆద్యుడిగా భావిస్తున్న కీలక యువకుడితో పాటు మొత్తం ఆరుగురిని గుర్తించారు. ఆరోజు వారు ఫోన్లు చేసి అప్పటికప్పుడు యువకులను పిలిపించినట్లు వారు వినియోగించిన సెల్‌ఫోన్ల కాల్‌డేటాను విశ్లేషించి తెలుసుకున్నారు. వీడియో ఫుటేజీల ఆధారంగా పోలీసులపై రాళ్లు రువ్వటం, అదనపు ఎస్పీ వాహనాన్ని పగలగొట్టినట్లు ఆధారాలు పోలీసులు సేకరించారు. విచారణ ఇంకా కొనసాగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read