గుంటూరు జిల్లా, గురజాలలో అల్లర్లు సృస్టించటానికి ప్రయత్నించిన, వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ముందస్తు వ్యూహంతో కట్టడి చేసారు. స్థానిక ఎమ్మల్యే ఎరపతనేని శ్రీనివాస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, అక్రమ మైనింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ, మేము నిజనిర్థారణ చేస్తామని, కమిటీ పేరుతో వైకాపా నేతలు దాచేపల్లి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అక్కడికి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. నేతలు ఎట్టిపరిస్థితుల్లోనూ దాచేపల్లి వెళతామడంతో ఎక్కడికక్కడ నేతలను గృహనిర్భంధం చేశారు.

gurajala 14082018 2

ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా గురజాల, దాచేపల్లిలో 144 సెక్షన్‌ విధించారు.నిజనిర్థారణ కమిటీ పేరుతో వైకాపా నేతలు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి వెళ్తుండగా కాజా వద్ద బొత్స సత్యనారాయణతోపాటు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డిలను పోలీసులు అడ్డుకుని దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాచేపల్లిలో జంగాకృష్ణమూర్తిని గృహనిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డిని జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో నడికుడి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

gurajala 14082018 3

మరోవైపుగా దాచేపల్లి వెళ్లడానికి జిల్లా వైసీపీ నేతలు నరసరావుపేటలోని కాసుమహేష్‌రెడ్డి ఇంటికి అంబటిరాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్‌, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నాం బయలుదేరడానికి నేతలు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం, వీటి మీద ఆధారాలు ఉంటే కోర్ట్ కు వెళ్ళాలని, నిజ నిర్ధారణ అంటూ బొత్సా, జగన్ లాంటి వాళ్ళు ఇక్కడకు వచ్చి కామెడీ చేస్తే, ఎలా అని, దీని వెనుక అల్లర్లు జరుగుతాయానే సమాచారం ఉండబట్టే, వీరిని అరెస్ట్ చేసామని చెప్తున్నారు. జగన్, ఇలాంటి పనికిమాలని పనులు మానుకుని, నిజంగా ఎమన్నా అక్రమాలు జరిగితే, కోర్ట్ కు వెళ్లి, ఆధారాలు ఇవ్వాలని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read