వైకాపాని విమ‌ర్శించినా, ప్ర‌శ్నించినా ఎంత‌టి వారైనా ఒక‌టే ట్రీట్మెంట్. ఇదొక్క‌టే కాదు, చంద్ర‌బాబుని పొగిడినా వైకాపా బూత్ ఎటాక్స్ చ‌విచూడాల్సిందే. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గా ప‌నిచేసిన ఎన్వీ ర‌మ‌ణ కుటుంబ‌స‌భ్యుల్ని సోష‌ల్మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేయించి వైసీపీ పెద్ద‌లు..ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్  నిమ్మ‌గ‌డ్డ కుటుంబ‌స‌భ్యుల్ని సామాజిక‌మాధ్య‌మాల‌లోకి లాగేశారు. బూతులు, అస‌భ్య‌మైన మార్ఫింగ్ పోస్టుల‌కీ వెనుకాడ‌రు. కేసులు ఎదుర్కొంటారు, కోర్టుల్లో దోషులుగా నిల‌బ‌డ‌టానికైనా సిద్ధంగా ఉంటారు కానీ, బూతు దాడులు మాన‌రు. తాజాగా చంద్ర‌బాబుని పొగిడార‌ని ర‌జ‌నీకాంత్ ని తిట్టి తిట్టి అలిసిపోయారు వైకాపా పేటీఎం బ్యాచులు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేద‌ని ఆర్థిక నిపుణుడు జివి రావు (గంటా వెంక‌టేశ్వ‌ర‌రావు) ఈనాడుకి ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇదే ఆయ‌న చేసిన నేరం. ఆయ‌న టిక్ టాక్ వీడియోలు తీసుకొచ్చి ఒక రేంజులో ట్రోలింగ్ కి దిగారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ జివిరావుని ఆఫ్రికా వాడంటూ ఎద్దేవ చేయ‌డం మ‌రీ దారుణం. ఇదే జివి రావుని త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆర్థిక‌వేత్త‌గా స‌న్మానించారు. ఇదే జ‌గ‌న్ రెడ్డి చాన‌ల్ సాక్షి స్కాక్ మార్కెట్ ఎన‌లిస్టుగా చాలా డిబేట్ల‌కి గెస్ట్‌గా పిలిచారు. జ‌గ‌న్ రెడ్డి ఆయ‌న గ్యాంగ్‌కి మాత్రం జివి రావు జోక‌ర్ అంట‌.  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి వ‌చ్చే ఏడాది ఏప్రిల్ వ‌ర‌కూ పాల‌న నెట్టుకురావ‌డం క‌ష్ట‌మేన‌ని జివి రావు చెప్ప‌డ‌మే ఆయ‌న చేసిన నేర‌మ‌న్న‌ట్టు వైకాపాలో సీఎం నుంచి సోష‌ల్ మీడియా పేటీఎం బ్యాచుల వ‌ర‌కూ చాలా ఘోరంగా దూషిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read