తెలుగుదేశం పార్టీలో చేరిన జీవీ రెడ్డికి టిడిపి అధినేత చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. జీవీ రెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమిస్తూ, నిన్న టిడిపి ఏపి అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేసారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ నిర్ణయాలను, పార్టీ ఆశయాలను ప్రజల్లో బలంగా వినిపించేందుకు, మీడియాలో తమ పార్టీ వాణి వినిపించేందుకు జీవి రెడ్డిని పార్టీ ఉపయోగించుకోనుంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందినా జీవీ రెడ్డి, మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయినా కూడా, ఆయన కాంగ్రెస్ పార్టీ తరుపున బలంగా వాదించే వారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తులసి రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే వారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కావటంతో, సమకాలిక రాజకీయ విశ్లేషణను ప్రజల్లో బలంగా వినిపిస్తూ, ప్రజలకు అర్ధం అయ్యే భాషలో చెప్పే వారు. టీవీలలో అనేక డిబేట్లలో పాల్గునే వారు. అయితే మారిన పరిస్థితులు కారణంగా, ఆయన టిడిపిలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దసరా పండుగ ముందు చంద్రబాబుని కలిసారు. చంద్రబాబుతో పలు విషయాలు చర్చించిన అనంతరం, పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవటం, చంద్రబాబు కూడా ఒప్పుకోవటం జరిగింది.

gvreddy 29102021 2

ఈ నెల 21న ఆయన టిడిపిలో చేరారు. చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జీవీ రెడ్డి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. టిడిపిలో చేరటం సంతోషంగా ఉందని, జగన్ మోహన్ రెడ్డి విధ్వంసక పాలనను ఎదుర్కోవటానికి, బలమైన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చంద్రబాబు అభివృద్ధి కోరుకునే వ్యక్తీ అని, జగన్ వినాశకాలు కోరుకునే వ్యక్తి అని జీవీ రెడ్డి అన్నారు. రాష్ట్రం మరింతగా నాశనం కాకూడదు అంటుంటే, అందరూ చంద్రబాబుని బలపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇప్పుడు జీవీ రెడ్డికి చంద్రబాబు మరిన్ని బాధ్యతలు ఇచ్చారు. ఆయనను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక్కడ టిడిపి చెప్తున్న మరో మాట, టిడిపి పై వైసీపీ వేసిన కుల ముద్ర అంతా ఫేక్ అని, టిడిపి కుల పిచ్చి ఉన్న పార్టీ అయితే, జీవీ రెడ్డి టిడిపిలో ఎందుకు చేరతారని, టిడిపి అభివృద్ధి కాంక్షించే పార్టీ అని, అన్ని వర్గాలను ఆదరించే పార్టీ అని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read