ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై పెంచిందెంత, తగ్గించిందెంత అని ప్రతికా ప్రకటన ఇచ్చారు. అందులో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. ఆ ప్రకటనలో అన్నీ అవాస్తవాలే. ప్రజలపై భారం పడకూడదని కేంద్రం తగ్గించనప్పటికినీ 2018 లో చంద్రబాబు పెట్రోల్ ధర 80 రూపాయల కంటే తక్కువగా ఉన్నప్పటికి, దేశంలో ఏ రాష్ట్రం తగ్గించనప్పటికీ రెండు రూపాయలు తగ్గించి ప్రజలను ఆదుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇచ్చే ప్రభుత్వ పత్రికా ప్రకటనల్లో అన్నీ అబద్ధాలే ఉంటున్నాయి. ప్రతీది గత ప్రభుత్వంపై నెట్టేస్తున్నారు. జగన్ రెడ్డి పాదయాత్రలో బాదుడే బాదుడు అన్నారు. అదే బాదుడు మీరు కొనసాగించడంలేదా? పైగా అదనంగా ఒక రూపాయి పెంచామని గొప్పల్లాగ చెప్పుకుంటున్నారు. ధరలు పెంచుతూ 3 జీవోలిచ్చారు. చంద్రబాబు హయాంలో రోడ్డు సెస్సు వసూలు చేయలేదు. ప్రస్తుతం రోడ్లు బాగు చేయించకపోగా రోడ్డు సెస్సు వసూలు చేస్తున్నారు. డీజల్ ధరలు పెంచి ప్రజలపై మోపిన భారం చాలక మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్ల పై పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ప్రజల్ని మోసం చేయడమే.
పెట్రోల్, డీజిల్ ధరల గురించి పాదయాత్రలో ఏం మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదు. జగన్ రెడ్డి అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాల వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ అనార్ధాలన్నింటికీ కారణం జగన్ రెడ్డి ప్రభుత్వ దోపిడీ విధానాలే. జగన్ రెడ్డి ఆదాయం పెంచలేదుగానీ ధరలు మాత్రం విపరీతంగా పెంచుతున్నారు.. ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్నారు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు.? జగన్ రెడ్డి దూకుడు పెంచారని దీంతో జనంపై పెట్రోల్ ధరల బాదుడు బాదుతున్నారు. విపరీతంగా లిక్కర్ పై ఎక్సైజ్ డ్యూటీ వేశారు. విపరీతంగా ట్యాక్సులు పెంచారు. హౌస్ ప్రాపర్టీ పెంచారు. చెత్త సేకరణపై కూడా ట్యాక్స్ వేశారు. రూ. 14 వేలు తక్కువ వచ్చిన పాపానికి 14 వేల కోట్ల రూపాయలు అదనంగా ట్యాక్సులు వేశారు. తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల పరిపాలనలో పెట్రోల్, డీజిల్ పై 3,800 నుంచి 4,200 కోట్ల రూపాయలు వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికే పార్లమెంటు సమాచారం ప్రకారం 11వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో తెలపాలి. ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతున్నారు. కనీసం పది రూపాయలు తగ్గించాలి. దొంగ లెక్కలు చూపడం మాని పెట్రోల్ పై లీటరుకు కనీసం పది రూపాయలు తగ్గించాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం.