టీడీపీ నేతలకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో ప్రసంగం తర్వాత తనను టీడీపీ నేతలు బెదిరించారని నోటీసులో పేర్కొన్నారు. వీడియో ఆధారాలు రాజ్యసభ అధికారులకు ఆయన అందజేశారు. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో బెదిరించారని జీవీఎల్ ఆరోపించారు. వెంకయ్య నాయుడుకి ఇచ్చిన కంప్లైంట్ లో జీవీఎల్ రాస్తూ, టీడీపీ వైఫల్యాలను రాజ్యసభ వేదికగా ఎండగట్టడంతోనే తనను టీడీపీ నేతలు బెదిరించారని జీవీఎల్ అన్నారు. టీడీపీ నేతలు తనను హెచ్చరిస్తున్న వీడియో ఆధారాలను, ప్రెస్ లో వచ్చిన వాటిని రాజ్యసభ సెక్రటేరియట్ కు ఇస్తున్నట్టు జీవీఎల్ చెప్పారు.
నేను జూలై 24న రాజ్యసభలో, తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడిన అబద్ధాలు ఎండగట్టాను, అప్పటి నుంచి నా పై పగ పట్టారు, నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు అంటూ జీవీఎల్ ఆ లేఖలో రాసారు. వేమూరి ఆనంద సూర్య నా అంతు చూస్తాను అన్నాడు అంటూ జీవీఎల్ రాసారు. సోషల్ మీడియాలో కూడా నా పై దాడి చేస్తున్నారని, మోర పెట్టుకున్నారు జీవీఎల్. ఇక్కడ కామెడీ ఏంటి అంటే, ఇన్ని రూల్స్ మాట్లాడుతూ, నేను పర్ఫెక్ట్ అనే జీవీఎల్, ఆగష్టు 28, 2018న, తెలుగుదేశం పార్టీ నేతలు నా పై దాడి చేసారని అన్నారు. మనం ఇంకా జూలై నెలలోనే ఉంటే, ఆగష్టు నెలలో తెలుగుదేశం నేతలు చెప్పారు అంటూ జీవీఎల్ రాసిన రాతల పై, నెటిజెన్లు కౌంటర్ లు ఇస్తున్నారు.
మరోవైపు ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఉభయసభల్లో టీడీపీ ఎంపీలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణలో పార్లమెంటుకు వచ్చారు. ‘కుప్పం- కంగుంది’ వీధినాటకం ప్రదర్శిస్తూ ఎంపీ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మేధావులు, కళాకారులు ఎలుగెత్తి చాటుతున్నా మోదీకి చలనం లేదని ఎంపీ శివప్రసాద్ మండిపడ్డారు.