ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ ఒక ఆంధ్రా బ్రహ్మానందం అని, ప్రధాని నరేంద్ర మోదీకి ఊడిగం చేయడం జీవీఎల్ నైజమని, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అని అన్నారు. .కన్నా అవినీతిపై జీవీఎల్ సీబీఐ విచారణ ఎందుకు కోరరని ప్రశ్నించారు. మోదీ తాతగారి సొమ్ము ఏమైనా ఏపీకి ఇస్తున్నారా? అని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న, పోస్టర్లు వేసి మరి, మిమ్మల్ని ద్రోహులు అని ప్రజలకు చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో పక్క, జీవీఎల్‌ నరసింహరావు పై, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్.

gvl 06082018 2

జీవీఎల్‌ పొద్దెరగని పిచ్చోడని, ఏది పడితే అది వాగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని దారి మళ్లించేందుకు జీవీఎల్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎల్‌, కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా జరిగితే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీయే కాబట్టి సీబీఐ విచారణ చేపట్టమని సలహా ఇచ్చారు. అంతే కాకుండా వీటితో పాటు పీడీ యాక్టు, రాఫెల్‌ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. జీవీఎల్‌ నరసింహారావుపై మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

gvl 06082018 3

పీడీ అకౌంట్స్‌ అంటే ఏంటో జీవీఎల్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు. పీడీ అకౌంట్స్‌లో అవినీతికి ఆస్కారం ఉండదని, ఆర్థిక పరిజ్ఞానం లేని జీవీఎల్‌ రాజ్యసభలో ఏం చర్చిస్తారని నిలదీశారు. పీడీ అకౌంట్స్‌ అనేవి ఆర్ధికశాఖ నియంత్రణలో జరిగే కార్యక్రమాలని, పీడీ అకౌంట్స్‌కు 2జీ స్కామ్‌కు పోలిక ఏంటని మరోసారి ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 72,652 పీడీ ఖాతాలు నిర్వహించేవారని, పీడీ ఖాతాల్లో అత్యధికం స్థానిక సంస్థలకు చెందినవేనని యనమల రామకృష్ణుడు తెలిపారు. పీడీ ఖాతాలపై జీవీఎల్‌కు కనీస అవగాహన లేదని, బీజేపీ నేతల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎద్దేవాచేశారు. అన్ని రాష్ట్రాలు పీడీ ఖాతాలను నిర్వహిస్తాయని, స్థానిక నిధులు దుర్వినియోగం కాకుండా పీడీ ఖాతాలు ఓపెన్‌ చేస్తామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో 72,652 పీడీ ఖాతాలు ఉన్నాయని, 14వ ఆర్థికసంఘం నిధుల కోసం, అదనంగా ఏపీ 13199 పీడీ ఖాతాలను ఓపెన్‌ చేసిందని కుటుంబరావు వెల్లడించారు. గుజరాత్‌లో 29వేలు, పశ్చిమబెంగాల్‌లో34వేల బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read