నిన్న జరిగిన టీవీ డిబేట్లలో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీల్ కు ఛాలెంజ్ విసిరితే పారిపోయారు. ఇంతకీ జీవీల్ అంటే ఎవరో తెలీదు అంటారా.. ఈ మధ్యే వార్తల్లో వస్తున్నారు. అరకోటు వేసుకుని, ఎక్కువగా అమరావతి పై విమర్శలు చేస్తూ, మీకు మయసభ కావాలా అని అడుగుతూ ఉంటారు.. ఆయనే జేవీఎల్ అంటే... నిన్న టీవీ డిబేట్ లో, రాష్ట్ర ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఒక ఛాలెంజ్ విసిరారు. మీరు, నేను కొట్టుకోవటం ఎందుకు, కేంద్రం నుంచి ఒక ఐదుగురు, రాష్ట్రం నుంచి ఐదుగురు అధికారులని, ఓపెన్ డిబేట్ చెయ్యమని చెప్దాం.. టీవీ చానల్స్ ముందు ఈ డిబేట్ పెడదాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒప్పించి తీసుకువస్తా, మీరు కేంద్రం నుంచి తీసుకురండి, ప్రజల ముందు వాస్తవాలు ఉంచుదాం అని అంటే, జీవీఎల్ ఈ ఛాలెంజ్ స్వీకరించకుండా పారిపోయారు.
గురువారం సచివాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కుటుంబరావు మాట్లాడుతూ, కేంద్రం పై కొన్ని ఆరోపణలు చేసారు. వీటి పై సమాధానం చెప్పండి అంటే, ఒక్కడంటే ఒక్కడు ముందుకు రాలేదు. 2016-17కు సంబంధించి రూ.84,000 కోట్ల ఎడ్యుకేషన్ సెస్.. పద్దుల్లోనే లేదని కాగ్ నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ‘ఆ సెస్ మొత్తాన్ని విద్యాశాఖకు అప్పగించకుండా ఎటు మళ్లించారు? కనీసం సెస్ నిర్వహణ ఖాతా కూడా పెట్టలేదు. కేంద్రంలోని 19 శాఖలు సమర్పించిన యూసీలు సక్రమంగా లేవని కాగ్ తన నివేదికలో తెలిపింది. కొన్ని శాఖలు అసలు యూసీలే సమర్పించలేదు. సక్రమంగా నిధులు వినియోగిస్తూ.. యూసీలు సమర్పిస్తున్న నవ్యాంధ్రపై అమిత్ షా, జితేంద్ర సింగ్, జీవీఎల్ సరసింహారావు విమర్శలు చేస్తున్నారు. మా లెక్కలు అడిగేముందు మీ లెక్కలు సరి చూసుకోండి’ అని హితవు పలికారు.
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్‌కు అనుకూలంగా ఉంటాయని స్వయంగా నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సిఫారసు చేశాక కూడా.. రాష్ట్రానికి ఇవ్వకుండా దానిని కేంద్రం కోల్ట్‌స్టోరేజీలో పడేసిందన్నారు. ఏపీకి రూ.మూడున్నర లక్షల కోట్లు ఇచ్చామంటున్నారని.. దీనిపై వారు అధికారులతో చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. ఢొలేరా విషయంలో జీవీఎల్ బుధవారం చెప్పినవన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. ఢిల్లీ-ముంబై ఇండస్ర్టియల్ కారిడార్‌కు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా నిధులు కేటాయించి.. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. వీసీఐసీలో కృష్ణపట్నం పోర్టును నోడ్‌గా చేర్చాక ఒక్క రూపాయైునా ఇచ్చారా అని నిలదీశారు. ఢొలేరా స్మార్ట్ సిటీ ప్రణాళిక, డిజైన్‌లను సింగపూర్ సంస్థలే చేస్తున్నాయని, ఆ సంస్థలకు భాగస్వామ్యం కూడా ఉందని తెలిపారు. అలాంటిది అమరావతిలో కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో కలిసి రాష్ట్రప్రభుత్వం పనిచేస్తుంటే విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.