అందరి మీద నోరు పారేసుకుని, వాళ్ళ చేత లెఫ్ట్ అండ్ రైట్ వాయించుకునే జీవీఎల్ మళ్ళీ వచ్చారు. ఈ సారి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్‌గా మారిపోయారని ఆరోపించారు. పవన్.. పెద బాబునే కాదు చిన బాబును కూడా పల్లెత్తు మాట అనడం లేదని విమర్శలు గుప్పించారు. మంగళగిరి వైపు ఆయన కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శించారు. పవన్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. అందుకే పవన్ ఇటువంటి నాటకాలకు ఫుల్ స్టాప్ పెడితే ఆయనకే మంచిదని జీవీఎల్ హితవు పలికారు.
"దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో మోదీ ఎన్డీఏ ఒకవైపు.. పూర్తిగా భంగపడి, వైఫల్యం చెందిన పార్టీలన్నీ మరోవైపు ఉన్నాయి. ప్రతిపక్ష ఫార్టీలన్నీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయాయి. బీజేపీకి స్వతహాగా 300కు పైగా సీట్లు రావడం ఖాయం. ఎన్డీఏ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. చంద్రబాబు, రాహుల్ గాంధీ, మమతా వంటి వారికి ఓటమి భయం పట్టుకుంది.అందుకే బీజేపీ పైనా, మోదీ పైనా వ్యక్తిగత విమర్శ లు చేస్తున్నారు. రాహుల్ అందుకే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. కేరళ వంటి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో ఒప్పందం చేసుకుని రాహుల్ పోటీకి సిద్ధమయ్యారు" అని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.
"చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. గంటలపైగా మాట్లాడే బాబు ఏపీకి ఏంచేశారో చెప్పడం లేదు. కేంద్ర పథకాలను బాబు తన పథకాలుగా చెప్పుకుంటున్నారు. కియా వ్యవహారంలో అన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే.. తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు చెప్పిన సోదే మళ్లీ మళ్లీ చెబుతున్నారు. ఆయనను ప్రజలు పట్టించుకోక పోవడంతో జాతీయ నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. గంటలు గంటలు మాట్లాడే బాబు ఏపీకి ఏం చేశానో మాత్రం చెప్పడం లేదు. స్టిక్కర్ బాబుగా పేరు గాంచిన చంద్రబాబు కేంద్రం పధకాలను తనవిగా చెప్పుకుంటున్నారు. టీడీపీ ప్రకటనలు చూస్తే చాలా గొప్పగా ఉన్నాయి. వాటి వెనుక అమలు మాత్రం అంతా డొల్లే కేంద్రం పేదలకు ఇళ్లు ఇస్తే.. తన గొప్పగా చెప్పుకుంటున్నారు. త్వరలో సైకిల్ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం. టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు తయారయ్యారు..నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు" అని జీవీఎల్ విమర్శలు గుప్పించారు.