తెలుగుదేశం ఎంపీల సమావేశంలో రసాభాస చేసిన జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వాలని, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ను కలిసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మల్యేలు, నాయకులు. అయితే ఇదే సమావేశంలో పియూష్ గోయల్ తో కలిసి, సమావేశంలో పాల్గున్న జీవీఎల్ నరసింహారావు. ప్రతి విషయంలో కలగచేసుకుని, రైల్వే మంత్రి కంటే ముందుగానే సమాధానం ఇచ్చిన జీవీఎల్. ఢిల్లీలో ఆధార కార్డు ఉన్నాడు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్నాడికి, ఆంధ్రప్రదేశ్ విషయాలు గురించి ఎందుకని, అసలు ఏ అర్హతతో ఇక్కడ జీవీఎల్ కూర్చున్నాడని నిలదీసిన తెలుగుదేశం నేతలు.

gol 07082018 5

అయితే, నా ఇష్టం, నేను పాల్గుంటా, రైల్వే మంత్రి ఇష్టంతో ఇక్కడకు వచ్చా, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ రెచ్చిపోయిన జీవీఎల్. దీంతో ఎదురుతిరిన తెలుగుదేశం ఎంపీలు. ఇది ఒక రాష్ట్రానికి, కేంద్రానికి సంబంధించిన విషయమని, ఇదేమి రాజకీయ పార్టీ ఆఫీస్ కాదని, ఒక పద్ధతి ప్రకారం ఉండాలని, ఎవరి ఇష్టం కుదరదని, జీవీఎల్ కావాలనే గొడవ పెట్టుకుని, రచ్చ చెయ్యాలని చూస్తున్నారని, ఎంపీలు ఆందోళన చేసారు. జీవీఎల్ కి అందరూ కలిసి రౌండ్ అప్ చేసి, నువ్వు ఎవరూ అంటూ నిలదీశారు. మొత్తానికి, ఈ రోజు కుటుంబరావు గారు కాకుండా మిగతా ఎంపీల చేతిలో కోటింగ్ పూర్తి చేసుకున్నాడు జీవీఎల్. వీరి డిమాండ్‌కు స్పందించిన పీయూష్ గోయల్.. టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదిక అనంతరం.. రైల్వేజోన్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందని టీడీపీ నేతలు పీయూష్ గోయల్ ఆఫీసు ఎదుట ధర్నాకు దిగారు.

gol 07082018 2

కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ కోసం ఎంపీలతోపాటుగా ఢిల్లీలో పోరాటం చేసేందుకు మంగళవారం ఉత్తరాంధ్రకు చెందిన మూడు జిల్లాల ఎమ్మెల్యేలంతా ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వెంటనే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. రైల్వే జోన్ ద్వారా ఏడాదికి 7 వేల కోట్లు ఆదాయం వస్తుందని, ఇందుకోసం ఎంతోమంది పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.

gol 07082018 3

అనంతరం సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ.. రైల్వే జోన్ విషయంలో కేంద్రంపై టీడీపీ పోరాటం చేస్తుంది కానీ కేంద్రం స్పందించకపోవడంతో మేమందరం ఢిల్లీ వచ్చామన్నారు. పార్లమెంటు సభ్యులతో పాటు పోరాటం చేసేందుకే ఢిల్లీ వచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం మాట ఇచ్చి మరిచిపోయింది కానీ, ప్రజలందరూ పోరాటానికి సిద్దమయ్యారని రైల్వేమంత్రికి చెప్పేందుకు ఢిల్లీ వచ్చామని ఆయన అన్నారు.

gol 07082018 4

ఎంపీ తోట నర్సింహం మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజ్యసభలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి రైల్వేజోన్ ఇస్తామని చెప్పారు కానీ కేంద్రంలో ఉన్న అధికారులకు, మంత్రుల మాటలకు పొంతనలేదన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగే పరిస్థితి కనబడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ సాధించే వరకూ పోరాటం కొనసాగుతుందని ఎంపీ పేర్కొన్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read